ప్రతి భారతీయుడికీ హెల్త్ ఐడీ మంజూరు..ప్రధాని మోదీ

| Edited By: Anil kumar poka

Aug 15, 2020 | 10:48 AM

ప్రతి భారతీయుడి ఆరోగ్యానికి సంబంధించిన ఐడీని మంజూరు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఇందుకు నేషనల్ హెల్త్ మిషన్ ని ఆయన లాంఛనంగా లాంచ్ చేశారు. 

ప్రతి భారతీయుడికీ హెల్త్ ఐడీ మంజూరు..ప్రధాని మోదీ
Follow us on

ప్రతి భారతీయుడి ఆరోగ్యానికి సంబంధించిన ఐడీని మంజూరు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఇందుకు నేషనల్ హెల్త్ మిషన్ ని ఆయన లాంఛనంగా లాంచ్ చేశారు.  పూర్తి టెక్నాలజీతో కూడిన ఈ మిషన్ ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని ఆయన చెప్పారు. ఈ ఐడీలో ప్రతి వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించిన సమాచారమంతా ఉంటుందన్నారు. దీన్ని ఆరోగ్య సర్వీసులకు, మందులకు వాడవచ్ఛునని, ఒక ఆవ్యక్తి డాక్టర్ వద్దకు గానీ ఫార్మసీ వద్దకు గానీ వెళ్తే ఈ కార్డులో ప్రతి అంశమూ ఉంటుందని ఆయన చెప్పారు.ఈ మిషన్ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య పథకం కిందికి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ ఐడీ కార్డులో ప్రతి అంశమూ రహస్యంగా ఉంటుందని వివరించింది.