రైతుకు నష్టం కలిగిస్తున్న హాథ్రస్‌ కేసు విచారణ

|

Oct 19, 2020 | 3:33 PM

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో దళిత అమ్మాయిపై సామూహిక అత్యాచారం చేసి, చిత్రహింసలకు పాల్పడి ఆ అమ్మాయి ఉసురు తీసుకున్న ఘటనపై సీబీఐ విచారణ కొనసాగుతోంది.. నిందితుల ఇళ్లను సోదా చేసి ఆధారాలను సేకరించారు సీబీఐ అధికారులు.. దాంతో పాటు బాధిత అమ్మాయి కుటుంబసభ్యులను, నిందితులను, స్థానిక అధికారుల నుంచి కొంత సమాచారం రాబట్టారు.. ఇక్కడి వరకు బాగానే ఉంది.. కానీ సీబీఐ విచారణ కారణంగా తాను తీవ్రంగా నష్టపోయానని అంటున్నాడో రైతు.. అందుకు కారణమేమిటంటే అమ్మాయి అత్యాచారానికి గురైన […]

రైతుకు నష్టం కలిగిస్తున్న హాథ్రస్‌ కేసు విచారణ
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో దళిత అమ్మాయిపై సామూహిక అత్యాచారం చేసి, చిత్రహింసలకు పాల్పడి ఆ అమ్మాయి ఉసురు తీసుకున్న ఘటనపై సీబీఐ విచారణ కొనసాగుతోంది.. నిందితుల ఇళ్లను సోదా చేసి ఆధారాలను సేకరించారు సీబీఐ అధికారులు.. దాంతో పాటు బాధిత అమ్మాయి కుటుంబసభ్యులను, నిందితులను, స్థానిక అధికారుల నుంచి కొంత సమాచారం రాబట్టారు.. ఇక్కడి వరకు బాగానే ఉంది.. కానీ సీబీఐ విచారణ కారణంగా తాను తీవ్రంగా నష్టపోయానని అంటున్నాడో రైతు.. అందుకు కారణమేమిటంటే అమ్మాయి అత్యాచారానికి గురైన బూల్‌గర్హీ గ్రామంలోని పంట పొలాన్ని సీబీఐ అధికారులు అనేకసార్లు పరిశీలించారు.. క్రైమ్‌ సీన్‌ను కాపాడేందుకు పొలానికి దూరంగా ఉండాలని దాని యజమానికి చెప్పారు.. సీబీఐ అధికారుల ఆదేశాల మేరకు ఆ పొలం యజమాని దాని జోలికి వెళ్లలేదు.. నీళ్లు లేక చాలా పంట ఎండిపోయింది.. కలుపు కారణంగా కొంత పంట నాశనం అయ్యింది.. దీనికి తోడు చాలా మంది పంటను తొక్కి పాడుచేశారు.. తనకు ఎంత లేదన్నా 50 వేల రూపాయలకు పైగానే నష్టం జరిగిందని వాపోతున్నాడా రైతు.. ఇప్పటి వరకు కుటుంబసభ్యులమంతా పడిన శ్రమ వృధా అయ్యిందని, ప్రభుత్వం తనకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాడు.. ప్రభుత్వం ఈ రైతు మొర ఆలకించి తగు పరిహారం చెల్లిస్తుందో లేదో చూడాలి..