రోజుకు 32.6 లీటర్ల పాలిస్తూ.. గేదె వరల్డ్‌ రికార్డ్‌ ! ఎక్కడంటే..

|

Dec 11, 2019 | 4:13 PM

సాధారణంగా మన గేదెలు రోజుకు 4 నుంచి 5 లీటర్ల వరకు పాలిస్తుంటాయి. మరికొన్ని 5-6 లీటర్ల వరకు పాలిచ్చే గేదెలు కూడా ఉంటాయి. కానీ, హర్యాణ రాష్ట్రంలో ఓ గేదె మాత్రం ఏకంగా రోజుకి 32.6 లీటర్ల పాలిస్తూ వరల్డ్‌ రికార్డ్‌ నెలకొల్పింది. హరియాణా రాష్ట్రం హిసార్ జిల్లాలో ముర్రా జాతికి చెందిన సరస్వతి అనే గేదె రోజుకి ఏకంగా 32.6 లీటర్ల పాలు ఇచ్చింది. గతంలో పాకిస్తాన్‌లోని  ఫైసలాబాద్‌కు చెందిన ఓ ముర్రజాతి గేదె […]

రోజుకు 32.6 లీటర్ల పాలిస్తూ.. గేదె వరల్డ్‌ రికార్డ్‌ ! ఎక్కడంటే..
Follow us on

సాధారణంగా మన గేదెలు రోజుకు 4 నుంచి 5 లీటర్ల వరకు పాలిస్తుంటాయి. మరికొన్ని 5-6 లీటర్ల వరకు పాలిచ్చే గేదెలు కూడా ఉంటాయి. కానీ, హర్యాణ రాష్ట్రంలో ఓ గేదె మాత్రం ఏకంగా రోజుకి 32.6 లీటర్ల పాలిస్తూ వరల్డ్‌ రికార్డ్‌ నెలకొల్పింది. హరియాణా రాష్ట్రం హిసార్ జిల్లాలో ముర్రా జాతికి చెందిన సరస్వతి అనే గేదె రోజుకి ఏకంగా 32.6 లీటర్ల పాలు ఇచ్చింది. గతంలో పాకిస్తాన్‌లోని  ఫైసలాబాద్‌కు చెందిన ఓ ముర్రజాతి గేదె నెలకొల్పిన రికార్డును సరస్వతి బ్రేక్ చేసింది. ఏడేళ్ల వయసుగల సరస్వతి పంజాబ్‌ రాష్ట్రంలోని లుథియానాలో ప్రోగ్రసివ్‌ డైరీ పార్మర్స్‌ అసోసియేషన్ నిర్వహించిన ఇంటర్నేషనల్ డైరీ అండ్ అగ్రి ఎక్స్పో పోటీలో సరస్వతి పాలవెల్లువ సృష్టించింది. వరుసగా మూడు రోజుల పాటు 32 లీటర్లకు తగ్గకుండా పాలివ్వడంతో సరస్వతి వరల్డ్‌ రికార్డు సృష్టించింది. ఈ మేరకు నిర్వాహకుడు దల్జీత్‌ సింగ్‌ సదార్పురా ప్రకటించాడు.

సరస్వతి పాలతోనే కాకుండా తన అండాలతోనూ ఎంతో సంపాదన తెచ్చిపెడుతోంది. ఇది ముర్రా జాతికి చెందిన గేదె కావడంతో దీని నుంచి తయారయ్యే అండాల నుంచి కృత్రిమ పద్ధతుల్లో దూడలను ఉత్పత్తి చేస్తున్నారు. ఇక సరస్వతిని అమ్మాలంటూ రూ.51 లక్షల ఆఫర్ వచ్చినా దాని యజమాని సుఖ్‌బీర్ ధండా మాత్రం అందుకు ఒప్పుకోలేదట. కాగా, ఇటీవల సరస్వతికి పుట్టిన దూడను రూ.4.5 లక్షలకు అమ్మినట్లుగా సుఖ్‌బీర్‌ వెల్లడించారు.