Cyber Crime: పాకిస్తాన్ ఐపీ అడ్రస్ లతో ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్.. ఆరుగురు సైబర్ నేరగాళ్ల అరెస్ట్

|

Aug 09, 2022 | 8:06 AM

పాకిస్తానీ ఐపీ అడ్రస్ లతో హర్యానాతో పాటు పంజాబ్, ఢిల్లీకి చెందిన ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వ్యవహరంలో స్పెషల్ టాస్క్ ఫోర్సు పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని

Cyber Crime: పాకిస్తాన్ ఐపీ అడ్రస్ లతో ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్.. ఆరుగురు సైబర్ నేరగాళ్ల అరెస్ట్
Anil Vij (file Photo)
Follow us on

Cyber Crime: పాకిస్తానీ ఐపీ అడ్రస్ లతో హర్యానాతో పాటు పంజాబ్, ఢిల్లీకి చెందిన ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వ్యవహరంలో స్పెషల్ టాస్క్ ఫోర్సు పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారని హర్యానా హోంశాఖ మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ఎమ్మెల్యేల భద్రత, రాష్ట్రంలో శాంతి భద్రతలపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో హర్యానా అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆయన స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నామని, ఇప్పటికే ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో శాసనసభ్యులకు అదనపు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. కేవలం హర్యానాకు చెందిన శాసనసభ్యులకే కాకుండా పంజాబ్, ఢిల్లీకి చెందిన ఇద్దరు ఆమాద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వెళ్లినట్లు గుర్తించామన్నారు. ఈకేసు విచారణ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని హర్యానా హోంశాఖ మంత్రి అనిల్ విజ్ పేర్కొన్నారు. బెదిరింపు కాల్స్ చేయడానికి ఆప్ఘనిస్తాన్ లో రిజిస్టర్ చేసిన ఫోన్ నెంబర్ ను ఉపయోగించారని.. ఇది పాకిస్తాన్ ఐపి అడ్రస్ నుంచి పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు.

ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ ఘటనలో ముంబయికి చెందిన ఇద్దరు, ముజఫర్ పూర్ చెందిన మరో ఇద్దరితో పాటు బీహార్ కు చెందిన నలుగురిని అరెస్టు చేశామని హర్యానా హోంశాఖ మంత్రి అనిల్ విజ్ వెల్లడించారు. నిందితుల నుంచి 55 ఏటీఎంలు, 84 సిమ్ కార్డులు, 30 నుండి 35 చెక్కు బుక్ లు ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వివరించారు. కొన్ని కాల్స్ పాకిస్తాన్ లో నివాసం ఉంటున్న వారి నుంచి వచ్చాయని.. వీటిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులకు ఎటువంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధం లేదని, వీరు సైబర్ నేరగాళ్లని తెలిపారు. ప్రజాప్రతినిధుల స్వేచ్చకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందంటూ.. కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారంతో ఈకేసుల విచారణ జరుగుతుందన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..