వెండి కిరీటంతో ప్రధాని మోదీని ఆహ్వానిస్తాం, హనుమాన్ గర్హి ఆలయ పూజారి

| Edited By: Anil kumar poka

Aug 05, 2020 | 10:52 AM

అయోధ్యలో భూమిపూజకు రానున్న ప్రధాని మోదీని వెండి కిరీటంతో ఆహ్వానిస్తామని హనుమాన్ గర్హి ఆలయ ప్రధాన పూజారి ప్రేమ్ దాస్ జీ మహారాజ్ తెలిపారు. ఈ కిరీటంపై రాముని ఇమేజీ ఉంటుందన్నారు.

వెండి కిరీటంతో ప్రధాని మోదీని ఆహ్వానిస్తాం, హనుమాన్ గర్హి ఆలయ పూజారి
Follow us on

అయోధ్యలో భూమిపూజకు రానున్న ప్రధాని మోదీని వెండి కిరీటంతో ఆహ్వానిస్తామని హనుమాన్ గర్హి ఆలయ ప్రధాన పూజారి ప్రేమ్ దాస్ జీ మహారాజ్ తెలిపారు. ఈ కిరీటంపై రాముని ఇమేజీ ఉంటుందన్నారు. ఈ ఆలయంలో మూడున్నర కింటాళ్ళ బరువున్న గంటను మోదీ మోగిస్తారని, ఇక్కడ ప్రార్థనల అనంతరం రాంలాలా స్థలానికి బయలుదేరి వెళ్తారని ఆయన చెప్పారు. మోదీ రాక మాకెంతో గర్వకారణమన్నారు.

కాగా.. ఈ మధ్యాహ్నం 12.40 గంటలకు మోదీ భూమిపూజ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సుమారు గంటన్నర సేపు అక్కడ ఉండి 2 గంటలకు అక్కడినుంచి బయలుదేరతారు. ప్రధాని రాక సందర్భంగా అయోధ్య అంతటా పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేశారు. మోదీతో బాటు 50 మంది వీవీఐపీలు కూడా భూమి పూజలో పాల్గొంటారు. వేదికపై మోదీ సహామరో నలుగురు మాత్రమే ఆసీనులు కానున్నారు.