డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం కి నెగెటివ్.. …గురుగ్రామ్ మేదాంత ఆసుపత్రివర్గాల వెల్లడి

| Edited By: Anil kumar poka

Jun 07, 2021 | 7:29 PM

డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం కి కోవిద్ నెగెటివ్ రిపోర్టు వచ్చిందని గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రివర్గాలు తెలిపాయి. రోహతక్ లోని ఓ ఆసుపత్రిలో ఇటీవల జరిపిన టెస్టుల్లో ఆయనకు కోవిద్ పాజిటివ్ సోకిందని తెలిసింది. అయితే...

డేరా  సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం కి నెగెటివ్.. ...గురుగ్రామ్ మేదాంత ఆసుపత్రివర్గాల వెల్లడి
Gurmeet Ram Rahim Tests Negative For Covid Virus
Follow us on

డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం కి కోవిద్ నెగెటివ్ రిపోర్టు వచ్చిందని గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రివర్గాలు తెలిపాయి. రోహతక్ లోని ఓ ఆసుపత్రిలో ఇటీవల జరిపిన టెస్టుల్లో ఆయనకు కోవిద్ పాజిటివ్ సోకిందని తెలిసింది. అయితే తనకు కడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయనను గురుగ్రామ్ లోని ఈ హాస్పిటల్ కి నిన్న తరలించారు. సోమవారం తిరిగి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని తేలింది. రామ్ రహీం కి హానీప్రీత్ అనే మహిళ అటెండెంట్ (సహాయకురాలి) గా ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నెల 15 వరకు ఆమె ఈ బాధ్యతలు నిర్వహిస్తుంది. ఈమెను తన దత్త పుత్రికగా రామ్ రహీం చెప్పుకుంటాడు. 2017 లో ఇద్దరు మహిళా భక్తుల రేప్, సిర్సాకు చెందిన ఓ జర్నలిస్టు హత్య కేసులో రామ్ రహీం రోహతక్ లోని సునారియా జైల్లో 20 ఏళ్ళ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అటు-రోహతక్ లోని హాస్పిటల్ లో ఈయనకు వైద్య బృందం రాజభోగాలు సమకూర్చిందట.. ప్రత్యేక డాక్టర్ల బృందం ఈయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. స్పెషల్ రూమ్ ని కూడా కేటాయించినట్టు తెలిసింది.

తనను అవతార పురుషుడిగా చెప్పుకునే ఈయన.2014-15 సంవత్సరాల్లో కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. నాడు ఇతని ‘ఆశ్రమంలో’ వందలకొద్దీ భక్తులు ఉండేవారు. వారు ఈయనను తమ ఆరాధ్యదైవంగా కొలిచేవారట.. కానీ విధి వక్రించి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. .

మరిన్ని ఇక్కడ చూడండి: భార‌త్‌లో మ‌రో ప్ర‌మాద‌క‌ర క‌రోనా వేరియంట్‌..కొత్తరకం వైరస్ లక్షణాలు ఇవే :New Virus in India video.

ఆరు బయట నవారు మంచం మీద పిల్లలతో అలా బన్నీ హాయి ని అనుభవిస్తున్న అల్లు అర్జున్ : Allu Arjun Video viral.

ఆకు అంచున అద్భుతమైన పక్షిగూడు..నేచర్ టాలెంట్ కి ఫిదా అవుతున్న నెటిజెన్లు :Bird nest inside leaf viral video.

Shocking Video: తప్పిన పెను ప్రమాదం.. అతనే గనుక అలర్ట్‌గా లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో..వైరల్ అవుతున్న వీడియో.