గుజరాత్.. లాక్ డౌన్ బేఖాతర్.. గుంపులు.. గుంపులుగా.. సిగరెట్లు, బీడీల కోసం..

| Edited By: Anil kumar poka

May 03, 2020 | 11:57 AM

గుజరాత్ సురేంద్రనగర్ సమీపంలోని సుదండా గ్రామమది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ లాక్ డౌన్ కఠినంగా అమలవుతున్నా ఆ గ్రామస్థులకు మాత్రం పట్టినట్టు లేదు. కొన్ని రోజులుగా మూత పడిన పొగాకు ఉత్పత్తుల షాపు ఆ రోజు  తెరుస్తారని ఆ గ్రామస్థులకు తెలిసింది.  అంతే ! షాపు తెరవక ముందే ఒక్కసారిగా...

గుజరాత్.. లాక్ డౌన్ బేఖాతర్.. గుంపులు.. గుంపులుగా.. సిగరెట్లు, బీడీల కోసం..
Follow us on

గుజరాత్ సురేంద్రనగర్ సమీపంలోని సుదండా గ్రామమది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ లాక్ డౌన్ కఠినంగా అమలవుతున్నా ఆ గ్రామస్థులకు మాత్రం పట్టినట్టు లేదు. కొన్ని రోజులుగా మూత పడిన పొగాకు ఉత్పత్తుల షాపు ఆ రోజు  తెరుస్తారని ఆ గ్రామస్థులకు తెలిసింది.  అంతే ! షాపు తెరవక ముందే ఒక్కసారిగా ఆ షాపు ముందు సుమారు 50 మందికి పైగా చేరి దానిపై ఎగబడ్డారు. అసలే ఈ కరోనా కాలంలో సోషల్ డిస్టెన్స్ పాటించాలన్న ఆలోచన ఒక్కరికైనా లేదు. ఒకరిపై ఒకరు పడి తోసుకుంటూ, నెట్టుకుంటూ అక్కడ కనీవినీ ఎరుగని సీన్ సృష్టించారు. ఒక్క పోలీసు గానీ అధికారి గానీ అక్కడ కనిపిస్తే ఒట్టు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.