యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రధాని మోదీ తీవ్ర సంతాపం

| Edited By: Anil kumar poka

May 16, 2020 | 12:25 PM

యూపీలోని ఔరయ జిల్లా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.  ఎదురెదురుగా వస్తున్న రెండు ట్రక్కులు ఢీ కొన్న ఈ ప్రమాదంలో 24 మంది మరణించగా మరో 38 మంది గాయపడ్డారు...

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రధాని మోదీ తీవ్ర సంతాపం
Follow us on

యూపీలోని ఔరయ జిల్లా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.  ఎదురెదురుగా వస్తున్న రెండు ట్రక్కులు ఢీ కొన్న ఈ ప్రమాదంలో 24 మంది మరణించగా మరో 38 మంది గాయపడ్డారు. లక్నోకు సుమారు 200 కి.మీ. దూరంలోని ఔరయ జిల్లాలో జరిగిన ఈ దారుణ ప్రమాదంలో మృతులు, క్షత గాత్రుల్లో చాలామంది రాజస్తాన్, బీహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఉన్నారు. ఈ ఘటన చాలా ఘోరమైనదని, తక్షణ సహాయ చర్యల్లో ప్రభుత్వం నిమగ్నమై ఉందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలను ఆయన తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ గాయపడినవారు త్వరగా కోలుకోగలరన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. మృతుల కుటుంబాలకు రూ.రెండు లక్షలు, క్షత గాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.