విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం.. సుందర్ పిచాయ్ తో మోదీ చర్చ

| Edited By: Pardhasaradhi Peri

Jul 13, 2020 | 2:18 PM

దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 'ఆహ్వానించేందుకు' ప్రధాని మోదీ సమాయత్తమయ్యారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన చర్చల్లో ఆయన.. ఇందుకు తోడ్పడవలసిందిగా కోరారు. ఇండియాలో కరోనా వైరస్ వల్ల..

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం.. సుందర్ పిచాయ్ తో మోదీ చర్చ
Follow us on

దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ‘ఆహ్వానించేందుకు’ ప్రధాని మోదీ సమాయత్తమయ్యారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన చర్చల్లో ఆయన.. ఇందుకు తోడ్పడవలసిందిగా కోరారు. ఇండియాలో కరోనా వైరస్ వల్ల తలెత్తిన పరిస్థితిని, దేశ ఎకానమీ ఎదుర్కొంటున్న సమస్యను ఆయన ప్రస్తావించినట్టు తెలిసింది. ఈ తరుణంలో భారత ఆర్ధిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు సుందర్ పిచాయ్ సహకరించాలని ప్రధాని కోరినట్టు చెబుతున్నారు. ఎఫ్ డీ ల సేకరణకు తాము వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. ఇందుకు సుందర్ పిచాయ్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇంతకు మించి వివరాలు వెల్లడి కాలేదు. లోగడ 2015 లో మోదీ సిలికాన్ వ్యాలీని సందర్శించినప్పుడు పిచాయ్ ఆయనతో భేటీ అయ్యారు. కాగా-విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం తాము అన్ని అంతర్జాతీయ సంస్థలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ (స్వావలంబన) అని తాము నినాదమిచ్చినంత మాత్రాన.. విదేశీ ఇన్వెస్టర్లకు తలుపులు మూసినట్టు కాదని ఆయన స్పష్టం చేశారు. ఫేస్ బుక్, ఉబేర్ వంటి సంస్థలు ఢిల్లీలో స్టార్టప్ లు లాంచ్ చేయాలని  కూడా మోదీ ఆ మధ్య సూచించారు.