వచ్చే ఏడాది జరిగే గోవా ఎన్నికల్లో ప్రమోద్ సావంత్ మా పార్టీ సీఎం అభ్యర్థి.. బీజేపీ చీఫ్ నడ్డా

| Edited By: Phani CH

Jul 25, 2021 | 6:35 PM

వచ్చే ఏడాది జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ సీఎం అభ్యర్థి ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అని బీజేపీ చీఫ్ జె.పి.నడ్డా ప్రకటించారు. సావంత్ నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఆయన చెప్పారు.

వచ్చే ఏడాది జరిగే గోవా ఎన్నికల్లో ప్రమోద్ సావంత్ మా పార్టీ సీఎం అభ్యర్థి.. బీజేపీ చీఫ్ నడ్డా
Goa Cm Will Be Bjp Cm Candidate In Next Year
Follow us on

వచ్చే ఏడాది జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ సీఎం అభ్యర్థి ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అని బీజేపీ చీఫ్ జె.పి.నడ్డా ప్రకటించారు. సావంత్ నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఆయన చెప్పారు. ఎవరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్నది బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణఇస్తుందని, కానీ తన అభిప్రాయం మాత్రం ఇదేనని ఆయన అన్నారు., మరొకరి గురించి తాను యోచించడం లేదన్నారు. రెండు రోజుల పర్యటనకు గాను ఆయన శనివారం గోవా చేరుకున్నారు. గత నాలుగున్నర ఏళ్లలో ఈ రాష్ట్రంలో బీజేపీ చాలా బలోపేతమైందని ఆయన అన్నారు. నేను కేబినెట్ మంత్రులను, ఎమ్మెల్యేలు, ఎంపీలను, పార్టీ కార్యకర్తలతో కూడా భేటీ అయ్యాయని, పార్టీ పటిష్టతకు వారు చేసిన కృషి అవగతమైందని నడ్డా పేర్కొన్నారు. ఈ నాలుగున్నర సంవత్సరాల్లో పార్టీ చాలా ముందడుగు వేసిందన్నారు. బీజేపీ పాలిత అన్ని రాష్ట్రాల్లో ఈ విధమైన కృషి జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది చిన్న రాష్ట్రమైనప్పటికీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయమైందన్నారు.

2019 మార్చి లో ప్రమోద్ సావంత్ గోవా సీఎంగా పదవీ బాధ్యతలు చేబట్టారు. కోవిడ్ మొదటి. సెకండ్ వేవ్ లో కూడా =రాష్ట్రంలో పరిస్థితిని అదుపు చేయగలిగారని వార్తలు వచ్చాయి. బీజేపీ హైకమాండ్ కూడా దీన్ని గుర్తించింది. వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తానే సీఎం అభ్యర్థి అవుతానని సావంత్ ఇటీవల జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పేర్కొన్నారు. అయితే ఇందుకు పలువురు నేతలు అభ్యంతరం చెప్పినప్పటికీ ఇప్పుడు స్వయంగా పార్టీ చీఫ్ ఈ విషయాన్ని స్పష్టం చేయడం విశేషం. గోవా అసెంబ్లీలోని 40 సీట్లకు గాను పార్టీ 30 సీట్లను గెలుచుకుంటుందని సావంత్ అంటున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: కర్నాటకలో సీఎం ఎడ్యూరప్ప పదవికి ఢోకా లేనట్టే ! బాగా పని చేస్తున్నారన్న బీజేపీ చీఫ్ జె.పి. నడ్డా

Eluru Municipal Corporation Election Results: అదే రీసౌండ్, అదే రిజల్ట్.. ఏలూరు గడ్డపై వైసీపీ ఘన విజయం