కేరళ…ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా.. ఇండియాలో పెరుగుతున్న కేసులు

| Edited By: Anil kumar poka

Mar 08, 2020 | 11:53 AM

కేరళలో ఒకే కుటుంబంలోని ఐదుగురికి కరోనా పాజిటివ్ టెస్ట్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఇండియాలో కరోనా కేసులు 39 కి పెరిగాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ఇటలీకి ఈ ఫ్యామిలీ ఇటీవలే వెళ్లి వఛ్చినట్టు తెలిసింది.

కేరళ...ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా.. ఇండియాలో పెరుగుతున్న కేసులు
Follow us on

కేరళలో ఒకే కుటుంబంలోని ఐదుగురికి కరోనా పాజిటివ్ టెస్ట్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఇండియాలో కరోనా కేసులు 39 కి పెరిగాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ఇటలీకి ఈ ఫ్యామిలీ ఇటీవలే వెళ్లి వఛ్చినట్టు తెలిసింది. తిరువనంతపురం విమానాశ్రయంలో ఈ కుటుంబం తమ ట్రావెల్ హిస్టరీ గురించి తెలియజేయలేదని, వీరికి స్క్రీనింగ్ టెస్ట్ కూడా జరగలేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలజ తెలిపారు. ఆసుపత్రిలో చేరేందుకు కూడా వీరు నిరాకరించారని, అయితే వీరికి తాము నచ్ఛజెప్పామని అన్నారు. ఈ ఫ్యామిలీలో ఓ శిశువు లో కూడా కరోనా లక్షణాలు బయటపడ్డాయట. ఈ కుటుంబ సభ్యులు తమ బంధువులను కలుసుకున్నట్టు తెలిసింది. ఆ బంధువుల్లో కోవిడ్-19 సింప్టమ్స్ కనిపించగా వారిని ఐసొలేషన్లో ఉంచారు. అలాగే ఈ కుటుంబాన్ని కూడా ఐసొలేషన్ లో ఉంచడం జరిగింది.. అని శైలజ వివరించారు.