కరోనా ..మనుషుల మధ్య దూరం.. దూరం … సర్కిళ్లలో జనం

| Edited By: Anil kumar poka

Mar 25, 2020 | 2:12 PM

లాక్ డౌన్ నేపథ్యంలో కరోనా నివారణకు ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని ప్రధాని మోదీ సూచించడంతో దేశ వ్యాప్తంగా షాపులు, కూరగాయాల దుకాణాల ముందు జనం క్యూలలో నిలబడ్డారు.

కరోనా ..మనుషుల మధ్య దూరం.. దూరం ... సర్కిళ్లలో జనం
Follow us on

లాక్ డౌన్ నేపథ్యంలో కరోనా నివారణకు ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని ప్రధాని మోదీ సూచించడంతో దేశ వ్యాప్తంగా షాపులు, కూరగాయాల దుకాణాల ముందు జనం క్యూలలో నిలబడ్డారు. ఒక్కో వ్యక్తికి మధ్య కనీసం ఒక అడుగు దూరం ఉండేలా వాటి ఎదుట వైట్ పెయింట్ తో సర్కిళ్లు, స్క్వేర్లు గీశారు. తమ నిత్యావసర సరుకులకోసం వారు వాటి మధ్యలో ఓపికగా నిలబడక తప్పలేదు. అనేక నగరాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా బోసిపోయి కనిపిస్తుండగా.. ఈ షాపుల మధ్య కొనుగోలుదారులు ఇలా నిలబడిన దృశ్యాల తాలూకు వీడియోలు, ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి.  సోషల్ డిస్టెంసింగ్ పాటించాలని మోదీ ఇఛ్చిన పిలుపునకు ప్రజలంతా ఈ విధంగా స్పందిస్తున్నారంటూ పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఓ ఫోటోను ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే ఇలా చేయడం తప్పనిసరి అని మోదీ తన ప్రసంగంలో పదేపదే ప్రస్తావించారు.