రాజస్థాన్..ఎమ్మెల్యేల బేరసారాలపై 8 మంది సభ్యులతో దర్యాప్తు బృందం

| Edited By: Pardhasaradhi Peri

Jul 19, 2020 | 11:42 AM

రాజస్థాన్ లో ఎమ్మెల్యేల బేరసారాల కేసులో దర్యాప్తునకు 8 మంది సభ్యులతో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. జైపూర్ క్రైమ్ పోలీసుల విభాగంతో బాటు క్రిమినల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ కూడా సంయుక్తంగా దీనిపై ఇన్వెస్టిగేట్ చేయనుంది. ఎస్పీ వికాస్ శర్మ ఆధ్వర్యాన..

రాజస్థాన్..ఎమ్మెల్యేల బేరసారాలపై 8 మంది సభ్యులతో దర్యాప్తు బృందం
Follow us on

రాజస్థాన్ లో ఎమ్మెల్యేల బేరసారాల కేసులో దర్యాప్తునకు 8 మంది సభ్యులతో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. జైపూర్ క్రైమ్ పోలీసుల విభాగంతో బాటు క్రిమినల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ కూడా సంయుక్తంగా దీనిపై ఇన్వెస్టిగేట్ చేయనుంది. ఎస్పీ వికాస్ శర్మ ఆధ్వర్యాన ఈ బృందం..స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ నమోదు చేసిన రెండు ఎఫ్ ఐ ఆర్ లపై దర్యాప్తును మొదలుపెడుతుంది. ఆడియో టేపుల వ్యవహారంపై కాంగ్రెస్ చీఫ్ విప్ మహేష్ జోషీ దాఖలు చేసిన ఫిర్యాదును అలాగే ఆడియో టేపుల రికార్డింగులను ఈ బృందం అధ్యయనం చేయనుంది. ఈ కేసులో అరెస్టు అయిన కాంగ్రెస్ నేత సంజయ్ జైన్ ని నాలుగు రోజుల రిమాండుకు కోర్టు పంపింది.

అటు ఈ కేసులో నిందితులైన అశోక్ సింగ్, భరత్ మలానీ అనే ఇద్దరు వ్యక్తులు తమ గొంతుకు సంబంధించిన ‘శాంపిల్స్’ ని దర్యాప్తు బృందం పరిశిలనకు ఇచ్చేందుకు నిరాకరించారు. ఆడియో టేపుల వ్యవహారంలో ప్రముఖ బీజేపీ నేతల గొంతులను అనుకరించారని బీజేపీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే.