కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు, మాజీ ముఖ్య కార్యదర్శి శివశంకర్ పై ఈడీ చార్జిషీట్

| Edited By: Pardhasaradhi Peri

Oct 07, 2020 | 7:56 PM

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఈడీ బుధవారం కొచ్చి లోని ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ స్పెషల్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సీఎం పినరయి విజయన్..

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు, మాజీ ముఖ్య కార్యదర్శి శివశంకర్ పై ఈడీ చార్జిషీట్
Follow us on

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఈడీ బుధవారం కొచ్చి లోని ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ స్పెషల్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సీఎం పినరయి విజయన్ కార్యాలయ మాజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం.శివశంకర్ పాత్రపై సమగ్ర దర్యాప్తు జరగవలసిన అవసరం ఉందని ఈ చార్జిషీట్ లో పేర్కొంది. కేరళ ఐటీ శాఖకు చెందిన స్పేస్ పార్క్ కంపెనీలో స్వప్న సురేష్ నియామకం గురించి సీఎంకు తెలుసునని వెల్లడించింది. అయితే సీఎం చాలాసార్లు ఖండించారు. స్వప్న సురేష్, శివశంకర్ చాలా సార్లు కలుసుకున్నారని, శివశంకర్ కోర్కెపై స్వప్న బ్యాంక్ లాకర్ తెరిచిందని, పేర్కొంటూ ఇంకా ఈ కేసులో సరిత్, వేణుగోపాల్. సందీప్, రమీస్ తదితరుల పేర్లను ప్రస్తావించింది. సరిత్ డాక్యుమెంట్ల ఫోర్జరీ, త్రివేండ్రం విమానాశ్రయం నుంచి 21 సార్లు బంగారం స్మగ్లింగ్ వగైరా పాత ఉదంతాలను ఈడీ వివరించింది.