Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..

|

Apr 26, 2024 | 12:01 PM

ఈ క్రమంలోనే తాజాగా ఓ కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ క్రికెట్ ధోనీ పేరుతో ఇప్పుడు కొత్త స్కామ్‌కు తెర తీశారు. ఈ విషయమై డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలిగ్రామ్‌ ఇండియా కీలక ప్రకటన చేసింది. ట్విట్టర్‌ వేదికగా ఈ విషయమై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతకీ ధోనీ పేరుతో జరుగుతోన్న ఈ స్కామ్‌ ఏంటి..? దీని నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు చూద్దాం..

Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
Dhoni
Follow us on

మారుతోన్న కాలంతో పాటు నేరాల తీరు కూడా మారుతోంది. పెరిగిన టెక్నాలజీతో పాటు నేరాలు కూడా మారుతున్నాయి. ముఖ్యంగా సైబర్‌ నేరాలు ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. రకరకాల మార్గాల్లో ప్రజలను దోచుకుంటున్నారు కేటుగాళ్లు. ఫిషింగ్ మెసేజ్‌లు, స్పామ్‌ మెసేజ్‌లతో బురిడి కొట్టిస్తున్న స్కామర్లు తాజాగా కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. సెలబ్రిటీల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఓ కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ క్రికెట్ ధోనీ పేరుతో ఇప్పుడు కొత్త స్కామ్‌కు తెర తీశారు. ఈ విషయమై డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలిగ్రామ్‌ ఇండియా కీలక ప్రకటన చేసింది. ట్విట్టర్‌ వేదికగా ఈ విషయమై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతకీ ధోనీ పేరుతో జరుగుతోన్న ఈ స్కామ్‌ ఏంటి..? దీని నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు చూద్దాం..

మహేంద్ర సింగ్ ఫొటోతో కూడిన ఓ మెసెజ్‌ను పంపిస్తున్నారు కేటుగాళ్లు. ఇందులో భాగంగా ‘నేను ధోనీ. నేను రాంచి శివారులో ఉన్నాను. అనుకోని పరిస్థితుల్లో నా వాలెట్‌లో డబ్బులు లేవు. నేను తిరిగి ఇంటికి వెళ్లడానికి కూడా డబ్బులు నాకు కొంతం డబ్బులు పంపిస్తే ఇంటికి వెళ్లగానే తిరిగి చెల్లిస్తాను అంటూ పేర్కొంటూ ఓ మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేస్తున్నారు. అయితే వెనకా ముందు ఆలోచించని కొందరు నిజమో అనుకొని డబ్బులు పంపిస్తున్నారు. ఇదే విషయమై డాట్‌ క్లారిటీ ఇచ్చింది.

ట్విట్ర్‌ వేదికగా ఈ విషయాన్ని తెలుపుతూ.. ఎవరైనా ధోనీ పేరుతో ఇలా బస్సు టికెట్ల కోసం అడుగుతూ మెసేజ్‌ చేస్తే అది కచ్చితంగా గూగ్లీ బాల్‌ అవుతుంది. మీరు కనుక షాట్‌ ఆడడానికి ట్రై చేస్తే కచ్చితంగా క్యాచ్‌ అవుట్ అవుతారు. మీకు ఇలాంటి మెసేజ్‌ వస్తే ధోనీ ఎలా అయితే క్షణాల్లో స్టంప్‌ అవుట్‌ చేస్తారో అలాగే ఫిర్యాదు చేయండని ఓ లింక్‌ను అందించారు. ఈ లింక్‌పై క్లిక్‌ చేసి ఇలాంటి వాటిపై ఫిర్యాదు చేయాలని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..