వ్యాక్సిన్ తీసుకోగానే సరిపోదు, ప్రోటోకాల్స్ ని నిర్లక్ష్యం చేయకండి. ప్రధాని మోదీ, రెండు డోసులూ తీసుకోవాల్సిందే

| Edited By: Pardhasaradhi Peri

Jan 16, 2021 | 12:42 PM

వ్యాక్సిన్ తీసుకున్నాం కదా అని కోవిడ్ ప్రొటొకాల్స్ ని నిర్లక్ష్యం చేయరాదని ప్రధాని మోదీ అన్నారు. రెండు డోసులూ..

వ్యాక్సిన్ తీసుకోగానే సరిపోదు, ప్రోటోకాల్స్ ని నిర్లక్ష్యం చేయకండి. ప్రధాని మోదీ, రెండు డోసులూ తీసుకోవాల్సిందే
Follow us on

Covid Vaccine: వ్యాక్సిన్ తీసుకున్నాం కదా అని కోవిడ్ ప్రొటొకాల్స్ ని నిర్లక్ష్యం చేయరాదని ప్రధాని మోదీ అన్నారు. రెండు డోసులూ తీసుకోవడం ముఖ్యమని, ఒక్కో డోసు మధ్య నెల రోజుల విరామం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారని ఆయన చెప్పారు. టీకామందు తీసుకున్న వెంటనే మాస్కులు తొలగించడం, భౌతిక దూరం పాటించకపోవడం వంటివి మంచిది కాదని ఆయన అన్నారు. ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలన్నారు. ‘దవా భీ, కడా భీ’ (మందు, అప్రమత్తత) అని ఆయన వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా హెల్త్ లైన్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ సిబ్బంది ఈ వ్యాక్సిన్లు తీసుకోవడానికి ముందుకు రావడం హర్షనీయమని ఆయన పేర్కొన్నారు. ఇది మొదటి దశ మాత్రమేనని, మొత్తం 3 కోట్లమందికి ఈ టీకామందు ఇవ్వాల్సి ఉందని అన్నారు. శనివారం మూడు లక్షల మంది వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మోదీ చెప్పారు.  క్రమంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా  కొనసాగుతూనే ఉంటుందని ఆయన వివరించారు. ఇదొక మహా కార్యక్రమం అని అభివర్ణించారు.

కాగా- ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ సమక్షంలో మనీష్ కుమార్ అనే శానిటేషన్ వర్కర్ ఈ ఉదయం టీకామందు తీసుకున్న మొదటి వ్యక్తి అయ్యాడు. అనంతరం ఇతర వైద్య సిబ్బంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఢిల్లీలో మొత్తం 81 సెంటర్లను వ్యాక్సినేషన్ కేంద్రాలుగా ఎంపిక చేశారు. ఒక్కో సెంటర్లో 100 మందికి టీకామందును ఇవ్వనున్నారు.

Also Read:

Signal App: వాట్సప్ ప్రైవసీ పాలసీ ఎఫెక్ట్.. నిలిచిపోయిన ‘సిగ్నల్’ యాప్.. అసలు కారణం ఇదే..

Joe Biden Swearing Ceremony: అమెరికా అధ్యక్షుడు పెద్దన్న బైడెన్ ప్రమాణ స్వీకారంలో ఆడిపాడనున్న లేడీగాగా, జెన్నిఫర్‌ లోపెజ్

కోవాగ్జిన్ వల్ల ప్రజలు అస్వస్థత పాలైతే పరిహారం, ప్రత్యేక ఆసుపత్రుల్లో చికిత్స, మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.