హత్రాస్ ఘటనకు చెన్నైలో మహిళల నిరసన, కనిమొళి అరెస్ట్

| Edited By: Pardhasaradhi Peri

Oct 05, 2020 | 7:22 PM

హత్రాస్ ఘటనకు నిరసనగా సోమవారం సాయంత్రం చెన్నైలో డీఎంకె ఎంపీ కనిమొళి ఆధ్వర్యాన భారీ సంఖ్యలో మహిళలు గవర్నర్ నివాసం రాజ్ భవన్ వద్దకు ర్యాలీగా బయల్దేరారు. అయితే మధ్యలోనే పోలీసులు..

హత్రాస్ ఘటనకు చెన్నైలో మహిళల నిరసన, కనిమొళి అరెస్ట్
Follow us on

హత్రాస్ ఘటనకు నిరసనగా సోమవారం సాయంత్రం చెన్నైలో డీఎంకె ఎంపీ కనిమొళి ఆధ్వర్యాన భారీ సంఖ్యలో మహిళలు గవర్నర్ నివాసం రాజ్ భవన్ వద్దకు ర్యాలీగా బయల్దేరారు. అయితే మధ్యలోనే పోలీసులు వారిని అడ్డగించి కనిమొళి సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. హత్రాస్ ఘటన దేశానికే మచ్చగా కనిమొళి పేర్కొన్నారు.  దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కాగా-హత్రాస్ సంఘటన అనంతరం యూపీలో పోలీసులు 19 ఎఫ్ ఐ ఆర్ లను దాఖలు చేశారు. కుల విభజన, మత పరమైన వివక్ష, రాష్ట్రంపై కుట్ర తదితరాలను వీటిలో పేర్కొన్నారు. సీబీఐ విచారణకు సీఎం ఆదేశించిన తరువాత కూడా రాష్ట్రంలో ఉద్రిక్తత సృష్టించడానికి కొన్ని శక్తులు కుట్ర పన్నాయని ఆరోపించారు.