గూగుల్ పే తీరుపై హైకోర్టు గుర్రు..

|

May 15, 2020 | 5:31 PM

ఢిల్లీ హైకోర్టులో గూగుల్ పే యాజమాన్యానికి చుక్కెదురైంది. డిజిటల్ చెల్లింపుల్లో సరియైన మార్గదర్శకాలు పాటించడంలేదని దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టింది. గూగుల్‌ పే యాప్ యూపీఐ సేవలను నిలిపివేయాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం పాటు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, గూగుల్‌ ఇండియా డిజిటల్‌ సర్వీసెస్‌ ప్రవేట్‌ లిమిటెడ్‌కు నోటీసులు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ మార్గదర్శకాలను గూగుల్ పే సంస్థ ఉద్దేశపూర్వకంగానే పాటించడంలేదని ఆరోపిస్తూ శుభమ్ కపాలే […]

గూగుల్ పే తీరుపై హైకోర్టు గుర్రు..
Follow us on

ఢిల్లీ హైకోర్టులో గూగుల్ పే యాజమాన్యానికి చుక్కెదురైంది. డిజిటల్ చెల్లింపుల్లో సరియైన మార్గదర్శకాలు పాటించడంలేదని దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టింది.
గూగుల్‌ పే యాప్ యూపీఐ సేవలను నిలిపివేయాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం పాటు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, గూగుల్‌ ఇండియా డిజిటల్‌ సర్వీసెస్‌ ప్రవేట్‌ లిమిటెడ్‌కు నోటీసులు జారీచేసింది.

కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ మార్గదర్శకాలను గూగుల్ పే సంస్థ ఉద్దేశపూర్వకంగానే పాటించడంలేదని ఆరోపిస్తూ శుభమ్ కపాలే అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. గూగుల్ పే యూపీఐ సేవలను తక్షణమే నిలివేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా గూగుల్ పే యాప్ పనితీరుపై స్వతంత్ర విచారణ జరిపించాలని కూడా కోరారు

దీంతో ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం తోపాటు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, గూగుల్‌ ఇండియా డిజిటల్‌ సర్వీసెస్‌ ప్రవేట్‌ లిమిటెడ్‌కు నోటీసులు జారీచేసింది. ఇందుకు సంబంధించి వెంటనే అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

గూగుల్‌ ఇండియా డిజిటల్‌ సర్వీసెస్‌ తరఫున నోటీసులు స్వీకరించిన లాయర్‌ అఖిల్‌ ఆనంద్‌.. రిప్లై పిటిషన్‌ దాఖలు చేసేందకు మూడు వారాల గడువు కోరారు. ఇందుకు న్యాయస్థానం అనుమతినిస్తూ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్‌బీఐ వైఖరి స్పష్టం చేయాలని తెలిపింది.