రియాపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో క్రిమినల్ కేసు

| Edited By: Pardhasaradhi Peri

Aug 31, 2020 | 6:07 PM

సుశాంత్ సింగ్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై క్రిమినల్ కేసు దాఖలు చేసింది. నార్కోటిక్స్ కంట్రోల్ యాక్ట్ లోని 20, 22, 27, 29 సెక్షన్ల కింద ఆమెతో బాటు   ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి పై కూడా..

రియాపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో క్రిమినల్ కేసు
Follow us on

సుశాంత్ సింగ్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై క్రిమినల్ కేసు దాఖలు చేసింది. నార్కోటిక్స్ కంట్రోల్ యాక్ట్ లోని 20, 22, 27, 29 సెక్షన్ల కింద ఆమెతో బాటు   ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి పై కూడా క్రిమినల్ కేసు పెట్టినట్టు ఈ సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో ఫరూఖ్ షేఖ్ అలియాస్ ఫరూఖ్ బటాటా, బకుల్ చందాలియా అనే మరో ఇద్దరు వ్యక్తులను కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించనున్నారు. వీరిద్దరూ బాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీలకు డ్రగ్స్ సప్లై చేస్తుంటారని తెలుస్తోంది. ఇప్పటికే రియా, ఆమె సోదరుడు షోవిక్ లను సీబీఐ, ఈడీ అధికారులు అనేక సార్లు ఇంటరాగేట్ చేశారు. సుశాంత్ మరో సోదరి ప్రియాంకను కూడా సీబీఐ విచారించనుంది. డిప్రెషన్ తగ్గేందుకు సుశాంత్ మందులు తీసుకునే వాడన్న విషయం ప్రియాంకకు తెలుసునని భావిస్తున్నారు.