కోవిడ్-19 డేటాలో అన్నీ అవకతవకలే ! ఇది కరెక్టేనా ?

| Edited By: Pardhasaradhi Peri

May 13, 2020 | 4:10 PM

ఇండియాలో కరోనా కేసుల విషయంలో ఎప్పటికప్పటి డేటాకు సంబంధించి అన్నీ పొరబాట్లో, అవకతవకలో జరుగుతున్నాయని నిపుణులు వాపోతున్నారు. ఉదాహరణకు ముంబైలోని ధారావిలో గతవారం రోజుల్లో ఇన్ఫెక్షన్లు సోకినవారి శాతం 5.7 శాతం ఉండగా వీక్లీ యావరేజ్ రేటు 9.6 శాతం ఉన్నట్టు డేటాను సేకరించి ప్రకటించారని వారు పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ మాజీ వీసీ దినేష్ సింగ్ ఈ విషయాన్ని వివరిస్తూ.. ఇలాగే మహారాష్ట్రలో వారం రోజుల్లో సగటున ఇన్ఫెక్షన్లు ఏడు శాతం ఉన్నట్టు తనకు ఖఛ్చితమైన […]

కోవిడ్-19  డేటాలో అన్నీ అవకతవకలే ! ఇది కరెక్టేనా ?
Follow us on

ఇండియాలో కరోనా కేసుల విషయంలో ఎప్పటికప్పటి డేటాకు సంబంధించి అన్నీ పొరబాట్లో, అవకతవకలో జరుగుతున్నాయని నిపుణులు వాపోతున్నారు. ఉదాహరణకు ముంబైలోని ధారావిలో గతవారం రోజుల్లో ఇన్ఫెక్షన్లు సోకినవారి శాతం 5.7 శాతం ఉండగా వీక్లీ యావరేజ్ రేటు 9.6 శాతం ఉన్నట్టు డేటాను సేకరించి ప్రకటించారని వారు పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ మాజీ వీసీ దినేష్ సింగ్ ఈ విషయాన్ని వివరిస్తూ.. ఇలాగే మహారాష్ట్రలో వారం రోజుల్లో సగటున ఇన్ఫెక్షన్లు ఏడు శాతం ఉన్నట్టు తనకు ఖఛ్చితమైన సమాచారం ఉందని, కానీ అంతకు ముందే ఇది 21 శాతమని పేర్కొన్నారని వెల్లడించారు. ఇలా డేటా సేకరణలో లోపలకు కారణం విద్యా సంస్థల్లో సరైన డేటా శిక్షణ కేంద్రాలు లేకపోవడమే అని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీ లీని ఎయిమ్స్ లో కూడా ఈ విధమైన సౌకర్యం లేదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా డేటాకు అవసరమైన వనరులను సమకూర్చుకోవాలని, అన్ని విద్యా సంస్థల్లో తగిన శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలనీ ఆయన ప్రభుత్వాన్ని కోరారు.