Delhi CM: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టు కీలక ఆదేశాలు

|

Mar 28, 2024 | 5:52 PM

కేజ్రీవాల్‌ ఈడీ కస్టడీని పొడిగించింది రౌస్‌ అవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్‌ను మరో ఏడు రోజుల కస్టడీ కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు.. ఏప్రిల్‌ 1 వరకు కస్టడీ పొడిగిస్తూ తీర్పునిచ్చింది. మరోవైపు సీఎం పదవి నుంచి తొలగించాలన్న పిల్‌ను కోర్టు తిరస్కరించింది.

Delhi CM: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టు కీలక ఆదేశాలు
Arvind Kejriwal
Follow us on

కేజ్రీవాల్‌ ఈడీ కస్టడీని పొడిగించింది రౌస్‌ అవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్‌ను మరో ఏడు రోజుల కస్టడీ కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు.. ఏప్రిల్‌ 1 వరకు కస్టడీ పొడిగిస్తూ తీర్పునిచ్చింది. మరోవైపు సీఎం పదవి నుంచి తొలగించాలన్న పిల్‌ను కోర్టు తిరస్కరించింది. ఇక కోర్టుకు తీసుకువెళ్లే సమయంలో కేజ్రీవాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తన అరెస్ట్‌ రాజకీయ కుట్ర అని.. ఢిల్లీ ప్రజలే గట్టిగా సమాధానం చెబుతారని అన్నారాయన. అసలు లిక్కర్‌ స్కామ్‌లో 100 కోట్లు ఎక్కడ ఉన్నాయో చెప్పాలన్నారు కేజ్రీవాల్‌. తనను ఆమ్‌ ఆద్మీ పార్టీని బద్నాం చేసేందుకు ఈడీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. నన్ను అరెస్ట్‌ చేయడమే ఈడీ లక్ష్యమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు లిక్కర్‌ స్కామ్‌లో కేజ్రీవాల్ 100 కోట్ల లంచం తీసుకున్నారని గట్టిగా చెప్తోంది ఈడీ. ఆయన విచారణకు సహకరించడం లేదు కాబట్టి అరెస్టు చేసే హక్కు ఉందంటున్నారు ఈడీ అధికారులు. శరత్ చంద్రారెడ్డి 50 కోట్ల రూపాయలు ఎలక్ర్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీకి ఇచ్చిన నిధులకు.. లిక్కర్ కేసుకు సంబంధం లేదన్నారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ హవాలా డబ్బు ద్వారా గోవా ఎన్నికల్లో ఖర్చు చేసిన వివరాలు తమ దగ్గర ఉన్నాయంటూ కోర్టులో చెప్పారు ఈడీ అధికారులు.

కాగా గోవా ఎన్నికల్లో ఆప్‌ హవాలా సొమ్మును ఉపయోగించినట్టు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని కోర్టుకు ఈడీ తెలిపింది. మాగుంట రాఘవ ఇచ్చిన 6 స్టేట్‌మెంట్లలో తన పేరు ప్రస్తావన లేదన్నారు కేజ్రీవాల్‌. సీబీఐ 31 వేల పేజీల ఛార్జ్‌షీట్‌ , ఈడీ 25 వేల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసిందని కాని తనను ఎందుకు అరెస్ట్‌ చేశారో అర్ధం కావడం లేదన్నారు కేజ్రీవాల్.