కరోనా కాటు…. తేయాకు తోటలకు ‘చెద’.. తగ్గిన ఎగుమతులు

| Edited By: Ravi Kiran

Apr 29, 2020 | 12:52 PM

కరోనా లాక్ డౌన్ కారణంగా గ్లోబల్ టీ మార్కెట్ కుదేలవుతోంది.  తేయాకు తోటల్లో పని చేసే లక్షలాది మహిళలు, ఇతర సిబ్బంది ఖాళీగా కూర్చోవలసి వస్తోంది. చైనా, ఇండియా, కెన్యా, శ్రీలంక, వియత్నాం దేశాలు మొత్తం గ్లోబల్ ఎగుమతుల్లో 82 శాతం భాగస్వామ్యం వహిస్తున్నాయి...

కరోనా కాటు.... తేయాకు తోటలకు చెద.. తగ్గిన ఎగుమతులు
Follow us on

కరోనా లాక్ డౌన్ కారణంగా గ్లోబల్ టీ మార్కెట్ కుదేలవుతోంది.  తేయాకు తోటల్లో పని చేసే లక్షలాది మహిళలు, ఇతర సిబ్బంది ఖాళీగా కూర్చోవలసి వస్తోంది. చైనా, ఇండియా, కెన్యా, శ్రీలంక, వియత్నాం దేశాలు మొత్తం గ్లోబల్ ఎగుమతుల్లో 82 శాతం భాగస్వామ్యం వహిస్తున్నాయి. కానీ లాక్ డౌన్ ఆంక్షల కారణంగా రవాణా స్తంభించిపోవడంతో.. ఎగుమతులు తగ్గిపోవడమే కాక.. తేయాకు తోటల కార్మికులు పని లేక ఉసూరుమనాల్సి  వస్తోంది. ఈ ఏడాది మన దేశంలో తేయాకు ఉత్పత్తి 120 మిలియన్ కేజీలకు (9 శాతం) తగ్గవచ్చునని భావిస్తున్నారు. అలాగే ఇదే సంవత్సరంలో ఇండియా నుంచి ఎగుమతులు ఏడు శాతం తగ్గడం ఖాయమని ఇంటర్నేషనల్ టీ కమిటీ భావిస్తోంది. గత మార్చిలో ఇండియా నుంచి తేయాకు ఎగుమతులు 34 శాతం మేర తగ్గాయి. ఇతర రంగాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇఛ్చినట్టే ఈ రంగానికి కూడా ఇవ్వాలని లక్షలాది తేయాకు కార్మికులు కోరుతున్నారు.