పెళ్లి కోసమే మతం మార్చుకుంటే కుదరదు

|

Oct 30, 2020 | 4:57 PM

భిన్న మతస్తులు పెళ్లి చేసుకుంటే ఇద్దరిలో ఎవరో ఒకరు మతం మార్చుకోవలసిందేనా? వేరువేరు మతాలను ఆచరిస్తూ కలిసి కాపురం చేయలేరా? ఎందుకు చేయలేరు? భేషుగ్గా ఓ కప్పుకింద హాయిగా ఉండవచ్చు..

పెళ్లి కోసమే మతం మార్చుకుంటే కుదరదు
Follow us on

భిన్న మతస్తులు పెళ్లి చేసుకుంటే ఇద్దరిలో ఎవరో ఒకరు మతం మార్చుకోవలసిందేనా? వేరువేరు మతాలను ఆచరిస్తూ కలిసి కాపురం చేయలేరా? ఎందుకు చేయలేరు? భేషుగ్గా ఓ కప్పుకింద హాయిగా ఉండవచ్చు.. ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరచింది అలహాబాద్‌ హైకోర్టు.. అసలు పెళ్లి కోసమే మతం మార్చుకుంటానంటే కుదరదని స్పష్టం చేసింది.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ముస్లిం అమ్మాయి హిందు అబ్బాయిని పెళ్లి చేసుకుంది.. పెళ్లికి నెల రోజుల ముందే హిందూమతం పుచ్చుకుంది.. పెళ్లయిన తర్వాత తమకు పోలీసు రక్షణ కల్పించాలంటూ అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు నూతన వధూవరులు.. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి మహేశ్‌ చంద్ర త్రిపాఠి కేవలం పెళ్లి ప్రయోజనం కోసమే మతం మార్చుకోవడం ఆమోదయోగ్యం కాదన్నారు. 2014లో అలహాబాద్‌ హైకోర్టే ఇచ్చిన ఒక తీర్పును త్రిపాఠి ప్రస్తావించారు. మత విలువలు, మత సంప్రదాయాలు గురించి తెలియకుండా, మతంపై నమ్మకం లేకుండా కేవలం పెళ్లి కోసమే మతాన్ని మార్చుకోవడం వల్ల ఎలాంటి లాభం లేదని చెప్పారు.. ఇదే అభిప్రాయాన్ని గతంలో సుప్రీంకోర్టు కూడా వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం ఈ విషయంలో జోక్యం చేసుకోబోమంటూ కొత్త దంపతులు పెట్టుకున్న రిట్ పిటిషన్‌ను కొట్టివేశారు మహేశ్‌చంద్ర త్రిపాఠి..