సీఏఏపై ఐరాస జోక్యం..’మోదీజీ !ఈ యవ్వారానికి మీదే బాధ్యత !’ కాంగ్రెస్ ధ్వజం

| Edited By: Pardhasaradhi Peri

Mar 04, 2020 | 4:38 PM

సీఏఏపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం జోక్యం చేసుకోవడం  ఒక విధంగా భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని, కానీ ఈ 'అనుచిత యవ్వారానికి' బాధ్యత మోదీ ప్రభుత్వానిదేనని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

సీఏఏపై ఐరాస జోక్యం..మోదీజీ !ఈ యవ్వారానికి మీదే బాధ్యత ! కాంగ్రెస్ ధ్వజం
Follow us on

సీఏఏపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం జోక్యం చేసుకోవడం  ఒక విధంగా భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని, కానీ ఈ ‘అనుచిత యవ్వారానికి’ బాధ్యత మోదీ ప్రభుత్వానిదేనని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సీఏఏని  వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై వెంటనే విచారణ జరపాలంటూ ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం సుప్రీంకోర్టులో ఓ దరఖాస్తును ఫైల్ చేసిన అంశాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ గుర్తు చేశారు. ఆ పిటిషన్లను పరిశీలించేటప్పుడు అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఈ సంఘం హెడ్ మిషెల్ బచిలెట్ జెరియా తమ అప్లికేషన్ లో కోరారని, ఇది మన దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని ఆయన పేర్కొన్నారు. కానీ, ఇందుకు ఎవరిని నిందించాలి అని ఆయన ప్రశ్నించారు. ఒక చట్టం అమలు విషయంలో ఈ విధమైన జోక్యం చేసుకునేందుకు భారత ప్రభుత్వం ఓ అంతర్జాతీయ సంస్థకు కవాటాలు తెరిచిందంటే.. అది మానవహక్కులపై మనం గ్లోబల్ ప్రమాణాలను ఉల్లంఘించామనడానికి నిదర్శనమే అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో నేత అభిషేక్ సింఘ్వీ కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఏఏపై ఒకటి కాదు.. 20, 30, 40 దేశాలు మనలను వేలెత్తి చూపిస్తున్నాయని, మన దేశాన్ని అనుమానంగా చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.