కోవాగ్జిన్ వల్ల ప్రజలు అస్వస్థత పాలైతే పరిహారం, ప్రత్యేక ఆసుపత్రుల్లో చికిత్స, మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.

| Edited By: Pardhasaradhi Peri

Jan 16, 2021 | 12:18 PM

కోవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ కారణంగా ఎవరైనా తీవ్ర అస్వస్థులైతే వారికి పరిహారం అందజేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం..

కోవాగ్జిన్ వల్ల ప్రజలు  అస్వస్థత పాలైతే పరిహారం, ప్రత్యేక  ఆసుపత్రుల్లో చికిత్స, మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.
Follow us on

Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ కారణంగా ఎవరైనా తీవ్ర అస్వస్థులైతే వారికి పరిహారం అందజేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సినేషన్ సెంటర్లలో  ప్రజలకు లేదా హెల్త్ లైన్ వర్కర్లకు అధికారులు అందజేసే అనుమతి పత్రాల్లో ఈ అంశానికి ప్రాధాన్యమిచ్చ్చారు. ముంబైలోని 60 ప్రభుత్వ ఆసుపత్రుల్లో గల సెంటర్లలో శనివారం ఈ టీకామందును ఇస్తున్నారు. కోవాగ్జిన్ తీసుకున్నవారిలో అస్వస్థతకు గురైనవారికి ప్రభుత్వం నిర్దేశించిన ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్య చికిత్సను అందజేస్తారు. పైగా ఇలాంటి ఉదంతాల కేసులకు టీకామందు ఉత్పాదక సంస్థే బాధ్యత వహిస్తుందని ఈ పత్రాల్లో పేర్కొన్నారు. కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ను అంగీకరించిన 11 రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఒకటి. ఇప్పటివరకు ఈ మూడో దశ ట్రయల్స్ ఇంకా పూర్తికాని విషయం గమనార్హం. అటు వ్యాక్సిన్ తీసుకోగోరేవారు తమకు కోవిషీల్డ్ కావాలో, కోవాగ్జిన్ కావాలో ఎంపిక చేసుకోవాలని కూడా ఈ పత్రాల్లో కోరారు.

అయితే కోవిషీల్డ్ వ్యాక్సిన్ కి సంబంధించి ఇలాంటి నిర్ణయాన్ని ప్రభుత్వం ఇంకా తీసుకోలేదు. ఈ టీకామందు అన్ని క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేసుకోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

Also Read:

Joe Biden Swearing Ceremony: అమెరికా అధ్యక్షుడు పెద్దన్న బైడెన్ ప్రమాణ స్వీకారంలో ఆడిపాడనున్న లేడీగాగా, జెన్నిఫర్‌ లోపెజ్

ABP-C Voter Survey: జాతీయ స్థాయిలో జగన్ మార్క్.. ఏబీపీ న్యూస్-సీ ఓటర్ సర్వేలో మెరుగైన ర్యాంక్.. టాప్-5 సీఎంలు వీరే

Union Ex-Minister Dead: కేంద్ర మాజీ మంత్రి కమల్ మొరార్కా మృతి, ఆయన మరణం తీరని లోటన్న రాజకీయ ప్రముఖులు