‘పౌరసత్వం ఇచ్చేందుకే… లాక్కోవడానికి కాదు.’ మోదీ

|

Jan 12, 2020 | 1:31 PM

సవరించిన పౌరసత్వ చట్టంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ చట్టం…  పౌరసత్వం ఇచ్చేందుకే తప్ప, లాక్కోవడానికి కాదని స్పష్టం చేశారు. ఆదివారం కోల్ కతా లోని బేలూరు మఠంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. ‘ మీరైతే ఈ చట్టం గురించి అవగాహన చేసుకున్నారని, కానీ ఇందుకు విపక్షాలు ఇష్టపడడం లేదని ‘ వ్యాఖ్యానించారు. కొన్ని స్వార్థపర శక్తులు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆయన విమర్సించారు. పాకిస్తాన్ లో మైనారిటీలు ఎదుర్కొంటున్న […]

పౌరసత్వం ఇచ్చేందుకే... లాక్కోవడానికి కాదు.  మోదీ
Follow us on

సవరించిన పౌరసత్వ చట్టంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ చట్టం…  పౌరసత్వం ఇచ్చేందుకే తప్ప, లాక్కోవడానికి కాదని స్పష్టం చేశారు. ఆదివారం కోల్ కతా లోని బేలూరు మఠంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. ‘ మీరైతే ఈ చట్టం గురించి అవగాహన చేసుకున్నారని, కానీ ఇందుకు విపక్షాలు ఇష్టపడడం లేదని ‘ వ్యాఖ్యానించారు. కొన్ని స్వార్థపర శక్తులు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆయన విమర్సించారు. పాకిస్తాన్ లో మైనారిటీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారిపై జరుగుతున్న దాడుల గురించి ప్రపంచానికంతటికీ తెలుసునని, 70 ఏళ్లుగా ఇలా ఎందుకు జరుగుతోందో పాక్  చెప్పాలని మోదీ అన్నారు. ఇతర రాష్ట్రాలే కాదు.. ముఖ్యంగా మన  దేశంలో ని ఈశాన్య రాష్ట్ర ప్రజలు కూడా  సీఏఏ గురించి ఎలాంటి ఆందోళనా చెందవలసిన అవసరం లేదన్నారు.  స్వామి వివేకానంద 157 వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రామకృష్ణ పరమహంస మిషన్ ప్రధాన కార్యాలయమైన బేలూరు మఠాన్ని సందర్శించిన మోదీ..  గతరాత్రి  ఈ మఠంలోనే  బస చేశారు. ఇది యాత్రా స్థలం కన్నా తక్కువైనదేమీ కాదని, అసలు  ఇక్కడికి వస్తే తన సొంత ఇంటికి వచ్చినట్టు ఉంటుందని మోదీ పేర్కొన్నారు. తనను ఆదరించిన ఈ మఠం అధ్యక్షునికి, ఇతర సాధువులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

శనివారం మోదీతో మర్యాదపూర్వకంగా సమావేశమైన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఎన్నార్సీ, సీఏఏలపై పునరాలోచించాలని కోరిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీకి వచ్చి ఇలాంటి అంశాలపై ప్రభుత్వంతో చర్చించాలని ప్రధాని ఆమెకు సూచించారు.