బీహార్ ఎన్నికల్లో ఒంటరిగానే ‘లోక్ జన శక్తి పార్టీ’ పోటీ ?

| Edited By: Pardhasaradhi Peri

Oct 04, 2020 | 4:59 PM

బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (ఎల్ జే పీ ) ఒంటరిగానే పోటీ చేయవచ్చునని తెలుస్తోంది. బీజేపీ మిత్ర పక్షమైన ఈ పార్టీ..సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యాన గల జేడీ-యూ పై అభ్యర్థులను..

బీహార్ ఎన్నికల్లో ఒంటరిగానే లోక్ జన శక్తి పార్టీ పోటీ ?
Follow us on

బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (ఎల్ జే పీ ) ఒంటరిగానే పోటీ చేయవచ్చునని తెలుస్తోంది. బీజేపీ మిత్ర పక్షమైన ఈ పార్టీ..సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యాన గల జేడీ-యూ పై అభ్యర్థులను నిలబెడుతుందని, బీజేపీపై కాదని పార్టీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. ఇది ఎల్ జే పీ-బీజేపీ కూటమి అవుతుందని పేర్కొన్నాయి. కాగా-చిరాగ్ పాశ్వాన్ తండ్రి, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కు గతరాత్రి ఢిల్లీలోని హాస్పిటల్ లో హార్ట్ సర్జరీ జరిగింది. ఆయన ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్..చిరాగ్ కి ఫోన్ చేసి తెలుసుకున్నారు.  బీజేపీ బలోపేతానికి తమ పార్టీ కృషి చేస్తుందని చిరాగ్ పాశ్వాన్ మళ్ళీ ప్రధానికి స్పష్టం చేశారు.