లడాఖ్ లో చైనా సైనికుని పట్టివేత, కీలక పత్రాలు స్వాధీనం

| Edited By: Pardhasaradhi Peri

Oct 19, 2020 | 3:47 PM

లడాఖ్ లోని డెమ్ చోక్ ప్రాంతంలో సోమవారం ఉదయం చైనా సైనికుడినొకరిని భారత సైన్యం పట్టుకుంది. అతని వద్ద సివిల్, మిలిటరీ డాక్యుమెంట్లు ఉన్నట్టు ఆర్మీ తెలిపింది. కార్పొరల్ స్థాయి సోల్జర్ అయిన ఇతడు గూఢచర్యం నెరపడానికి వచ్చాడా అన్న విషయమై ఆరా తీస్తున్నారు. గన్స్, ఇతర ఆయుధాలను మరమ్మతు చేసే సోల్జర్ గా ఇతడ్ని గుర్తించారు. ప్రొసీజర్ ప్రోటోకాల్ అనంతరం ఈ సైనికుడిని తిరిగి చైనాకు అప్పగించనున్నారు. ఇతడి పేరు ‘వాంగ్ యా లాంగ్’ అని […]

లడాఖ్ లో చైనా సైనికుని పట్టివేత, కీలక పత్రాలు స్వాధీనం
Follow us on

లడాఖ్ లోని డెమ్ చోక్ ప్రాంతంలో సోమవారం ఉదయం చైనా సైనికుడినొకరిని భారత సైన్యం పట్టుకుంది. అతని వద్ద సివిల్, మిలిటరీ డాక్యుమెంట్లు ఉన్నట్టు ఆర్మీ తెలిపింది. కార్పొరల్ స్థాయి సోల్జర్ అయిన ఇతడు గూఢచర్యం నెరపడానికి వచ్చాడా అన్న విషయమై ఆరా తీస్తున్నారు. గన్స్, ఇతర ఆయుధాలను మరమ్మతు చేసే సోల్జర్ గా ఇతడ్ని గుర్తించారు. ప్రొసీజర్ ప్రోటోకాల్ అనంతరం ఈ సైనికుడిని తిరిగి చైనాకు అప్పగించనున్నారు.

ఇతడి పేరు ‘వాంగ్ యా లాంగ్’ అని తెలిసిందని సైనిక వర్గాలు తెలిపాయి. అతి శీతల వాతావరణం కారణంగా ఇతనికి ఆక్సిజన్, ఆహారం, వెచ్ఛని దుస్తులు ఇచ్చినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఫార్మాలిటీస్ పూర్తి అయిన అనంతరం వాంగ్ ను ఛుషుల్-మోల్డో మీటింగ్ పాయింట్ వద్ద చైనా అధికారులకు అప్పగించనున్నారు.