చైనీయులకు నో పర్మిషన్.. ఢిల్లీ హోటళ్ల సంఘం నిర్ణయం

| Edited By: Pardhasaradhi Peri

Jun 25, 2020 | 5:56 PM

లదాఖ్ లో చైనా దూకుడు, ఆక్రమణకు నిరసనగా చైనీయులను తమ హోటళ్లకు, రెస్టారెంట్లకు అనుమతించరాదని, ఆలాగే తమ గెస్ట్ హౌసుల్లో వారికి వసతి కల్పించరాదని ఢిల్లీ లోని హోటళ్ల సంఘం నిర్ణయించింది. తమకు నగరంలో..

చైనీయులకు నో పర్మిషన్.. ఢిల్లీ హోటళ్ల సంఘం నిర్ణయం
Follow us on

లదాఖ్ లో చైనా దూకుడు, ఆక్రమణకు నిరసనగా చైనీయులను తమ హోటళ్లకు, రెస్టారెంట్లకు అనుమతించరాదని, ఆలాగే తమ గెస్ట్ హౌసుల్లో వారికి వసతి కల్పించరాదని ఢిల్లీ లోని హోటళ్ల సంఘం నిర్ణయించింది. తమకు నగరంలో మూడు వేల హోటళ్లు, 75 వేల గదులతో కూడిన గెస్ట్ హౌసులు ఉన్నాయని ఈ సంఘం పేర్కొంది. మా హోటళ్లు, ఈ గెస్ట్ హౌసుల్లో ఉన్న చైనా వస్తువులను వాడరాదని కూడా ఈ సంఘం తీర్మానించింది. ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ కు  ఈ సంఘం లేఖ రాసింది. చైనా ఉత్పత్తులను బాయ్ కాట్ చేయాలని  దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతున్న తరుణంలో వీరు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. దేశంలో ఇప్పటికే చైనా వస్తువులను బహిష్కరించాలని క్రమంగా ఆందోళనలు ఊపందుకుంటున్నాయి. ప్రధాన రేవులు, విమానాశ్రయాల్లో చైనా ఉత్పత్తులను నిలిపివేస్తున్నారు. అయితే కేంద్రం నుంచి ఇప్పటివరకు ఈ బాయ్ కాట్ కి సంబంధించి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులూ జారీ కాలేదు