ఇండియాతో సానుకూల పరిష్కారం.. చైనా శాంతి మంత్రం

| Edited By: Pardhasaradhi Peri

Jun 10, 2020 | 6:57 PM

లడఖ్ లో వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు సడలుతున్నాయని చైనా ప్రకటించింది. ఈ నెల 6 న ఉభయ దేశాల సైనికాధికారుల సమావేశంలో..పరిస్థితి సడలింపునకు ఉద్దేశించి చేపట్టిన చర్చల్లో..

ఇండియాతో సానుకూల పరిష్కారం.. చైనా శాంతి మంత్రం
Follow us on

లడఖ్ లో వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు సడలుతున్నాయని చైనా ప్రకటించింది. ఈ నెల 6 న ఉభయ దేశాల సైనికాధికారుల సమావేశంలో..పరిస్థితి సడలింపునకు ఉద్దేశించి చేపట్టిన చర్చల్లో ‘సానుకూల పరస్పర అంగీకారం’ కుదిరిందని, రెండు దేశాల దళాలూ దీన్ని అమలుపరచడం ప్రారంభించాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునే యత్నంలో భాగంగా భారత-చైనా దళాలు లడఖ్ లోని కొన్ని ప్రాంతాల్లో వెనక్కి వెళ్లాయని ఢిల్లీలోని అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హూ చున్ ఇంగ్ ఈ విషయాన్ని మీడియాకు స్పష్టం చేస్తూ.. నియంత్రణ రేఖ వద్ద రెండు దేశాల సైనికులూ పరిస్థితి సడలింపునకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఈ మధ్యే ఉభయ దేశాల మధ్య దౌత్య, సైనిక స్థాయిల్లో.. ఫోన్ ద్వారా పరస్పర సంప్రదింపులు జరిగాయని ఆమె తెలిపారు.

కాగా-లడఖ్ లోని గాల్వాన్ వ్యాలీతో బాటు మూడు చోట్ల భారత, చైనా దళాలు తమ ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లినట్టు ఢిల్లీలో సైనిక వర్గాలు తెలిపాయి. గాల్వాన్ ఏరియా, పెట్రోలింగ్ పాయింట్-14, పెట్రోలింగ్ పాయింట్-15, హాట్ స్ప్రింగ్స్-పెట్రోలింగ్ పాయింట్- 17 వద్ద 2 నుంచి 2.5 వరకు వెనక్కి వెళ్లినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి.