ఆయుధాలను పోగేసుకుంటున్న చైనా

|

Sep 03, 2020 | 3:12 PM

ప్రపంచమంతా శాంతిని కోరుకుంటుంటే చైనా వాడు మాత్రం కయ్యాలతో ప్రపంచాన్ని కకావికలం చేద్దామనుకుంటున్నాడు.. మనతోనూ గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నాడు.. ఓ పక్క చర్చలంటూనే సరిహద్దుల్లో బలగాలను మోహరిస్తున్నాడు.

ఆయుధాలను పోగేసుకుంటున్న చైనా
Follow us on

ప్రపంచమంతా శాంతిని కోరుకుంటుంటే చైనా వాడు మాత్రం కయ్యాలతో ప్రపంచాన్ని కకావికలం చేద్దామనుకుంటున్నాడు.. మనతోనూ గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నాడు.. ఓ పక్క చర్చలంటూనే సరిహద్దుల్లో బలగాలను మోహరిస్తున్నాడు.. ఆర్ధిక పరిపుష్టితో పాటు శక్తివంతమైన దేశంగా అవతరించాలన్నది చైనా ఆలోచన.. అందుకు అనుగుణంగానే శక్తివతమైన ఆయుధాలను సమకూర్చుకుంటున్నాడు.. వచ్చే పదేళ్లలో న్యూక్లియర్‌ వార్‌హెడ్లను డబుల్‌ చేసుకోవాలన్నది చైనా ప్లాన్‌.. ఇప్పటికే వివిధ ప్రాంతాలలో అణ్వాయుధ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్న చైనా వైమానిక, నావికా స్థావరాల నుంచి అణుబాంబులను ప్రయోగించే సామర్థాన్ని కూడా క్రమంగా పెంచుకుంటోంది.. డిఫెన్స్‌ కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తోంది.. ఇండో పసిఫిక్‌ ప్రాంతంపై కన్నేసిన చైనా దానిపై పెత్తనం సాగించేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది.. ఇప్పటికే పాకిస్తాన్‌, శ్రీలంక, మయన్మార్‌, థాయ్‌లాండ్‌, సింగపూర్‌, ఇండోనేషియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, కెన్యా, సిచిల్స్‌, టాంజానియా, అంగోలా, తజకిస్తాన్‌ మొదలైన దేశాలలో స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు సంసిద్ధమయ్యింది చైనా! ప్రపంచంలోనే అతి పెద్ద నావికాదళం తమకే ఉండాలన్నది చైనా ఎత్తుగడ! అందుకు తగినట్టుగా ప్రణాళికలను రచించుకుంటోంది. అమెరికాలో 293 యుద్ధ నౌకలు ఉంటే 350 యుద్ధ నౌకలుతో అగ్రస్థానంలో ఉండాలనుకుంటోంది చైనా! అమెరికాతో ఇప్పుడు చైనాకు సంబంధాలు అంతగా లేవు.. రెండు దేశాల మధ్య దూరం పెరిగింది.. చైనాపై అమెరికా గరంగరంగా ఉంది.. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే చైనా నావికాదళాన్ని పటిష్టం చేయాలనుకుంటోంది..