వార్ ఐడియా మాకు లేనే లేదు, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్

| Edited By: Anil kumar poka

Sep 23, 2020 | 1:41 PM

ఏ దేశంతో నైనా చర్చలు, సంప్రదింపుల ద్వారా వివాదాలను, విభేదాలను పరిష్కరించుకోవడానికే తాము ప్రాధాన్యమిస్తాము తప్ప , ఆయా దేశాలతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగాగానీ యుధ్ధం చేయాలన్న ఉద్దేశమే తమకు లేదని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ అన్నారు.

వార్  ఐడియా మాకు లేనే లేదు, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్
China president xi jinping
Follow us on

ఏ దేశంతో నైనా చర్చలు, సంప్రదింపుల ద్వారా వివాదాలను, విభేదాలను పరిష్కరించుకోవడానికే తాము ప్రాధాన్యమిస్తాము తప్ప , ఆయా దేశాలతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగాగానీ యుధ్ధం చేయాలన్న ఉద్దేశమే తమకు లేదని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 75 వ డిబేట్ లో పాల్గొన్న ఆయన, చర్చలే సమస్యకు పరిష్కారమని సన్నాయినొక్కులు నొక్కారు. భారత-చైనా దేశాల సేనల మధ్య ఘర్షణ గురించి ఇలా పరోక్షంగా మాట్లాడుతూ,, తమకు అన్ని దేశాలూ సమానమే అని, ఏ దేశంతోనూ వార్ ను కోరుకోవడంలేదని జీ జిన్ పింగ్ చెప్పారు. ‘మూసిన తలుపుల వెనుక మేమేమీ రహస్య కార్యకలాపాలు కొనసాగించడం లేదు. మాది పారదర్శక ప్రభుత్వం, అభివృధ్దే మా నినాదం’ అని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ గురించి ప్రస్తావిస్తూ, తాము ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శక సూత్రాల ప్రకారం నడచుకుంటున్నామని పేర్కొన్నారు. కఠినతరమైన లాక్ డౌన్ ఆంక్షలతో ఈ వైరస్ ని నియంత్రించగలిగామన్నారు.

అంతకుముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, కరోనా వైరస్ కి చైనాయే కారణమని ఆరోపించారు. ఇందుకు ఆ దేశంపై ఐక్యరాజ్యసమితి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.