చైనా రెచ్చగొడితే, పాక్ ఉగ్రవాదులు చొచ్చుకొస్తున్నారు !

| Edited By: Anil kumar poka

Sep 26, 2020 | 12:49 PM

జమ్మూ కాశ్మీర్ లో పెద్దఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని రహస్యంగా చేరవేయాలని, భారత వ్యతిరేక కార్యకలాపాలను ఉధృతం చేయాలని చైనా..-పాకిస్తాన్ ఐఎస ఐ ని ఆదేశిస్తోందని,

చైనా రెచ్చగొడితే, పాక్ ఉగ్రవాదులు చొచ్చుకొస్తున్నారు !
Follow us on

జమ్మూ కాశ్మీర్ లో పెద్దఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని రహస్యంగా చేరవేయాలని, భారత వ్యతిరేక కార్యకలాపాలను ఉధృతం చేయాలని చైనా..-పాకిస్తాన్ ఐఎస ఐ ని ఆదేశిస్తోందని, దాంతో ఆ సంస్థ ఈ లోయలో దొంగచాటుగా ఉగ్రవాదులను పంపడం, ఆయుధాల చేరవేత వంటివాటికి పాల్పడుతోందని ఇంటెలిజెన్స్  వర్గాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్ లో అస్థిరతను సృష్టించాలంటే ఇలా చేయక తప్పదని చైనా తన ప్లాన్ ని పాకిస్థాన్ కు వివరిస్తోందట..ఇటీవల ఈ కేంద్రపాలిత ప్రాంతంలో  భద్రతా దళాలు  స్వాధీనం చేసుకున్న ఆయుధాలు చాలావాటిలో చైనా మేడ్ మార్కింగులు ఉండడమే ఇందుకు సాక్ష్యమని ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఫిరోజ్ పూర్ నుంచి ఆఖ్ నూర్ వరకు ఈ మధ్య మన జవాన్లు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు ఇవి చైనాలో తయారైనవని చెప్పకనే చెప్పాయి.  రెండు రోజుల క్రితం పాకిస్తాన్ డ్రోన్ల ద్వారా జారవిడిచిన అసాల్ట్ రైఫిల్స్, మ్యాగజైన్స్, పలు తూటాలు చైనా మేడ్ వని స్పష్టంగా వెల్లడయింది.

ఆర్మీ చీఫ్ నరవాణే, బీ ఎస్ ఎఫ్ చీఫ్ రాకేష్ ఆస్తానా, సీ ఆర్ఫీ ఎఫ్ అధికారి ఏ.పి. మహేశ్వరి గత 10 రోజులుగా వాస్తవాధీన రేఖ వద్ద నెలకొన్న తాజా పరిస్థితిని సమీక్షించారు.