ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసు.. తండ్రీ కొడుకులపై ఈడీ చార్జిషీట్

| Edited By: Pardhasaradhi Peri

Jun 03, 2020 | 12:34 PM

ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంపైన, మరికొంతమందిపైన చార్జిషీట్ దాఖలు చేసినట్టు ఈ కేసును..

ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసు.. తండ్రీ కొడుకులపై ఈడీ చార్జిషీట్
Follow us on

ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంపైన, మరికొంతమందిపైన చార్జిషీట్ దాఖలు చేసినట్టు ఈ కేసును విచారిస్తున్న ఈడీ వర్గాలు తెలిపాయి. లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేశాక.. కోర్టులు మళ్ళీ యధాప్రకారం ప్రారంభం కాగానే ఓ హార్డ్ కాపీతో బాటు ఈ-చార్జిషీటును కూడా కోర్టుకు సమర్పిస్తామని ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు విదేశీ పెట్టుబడులను అనుమతించేందుకు చిదంబరం,  ఆయన కొడుకు కార్తీ ఇద్దరూ సుమారు 10 లక్షలు ముడుపులుగా అందుకున్నారని గతంలో సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో మరో దోషి అయిన ఇంద్రాణి ముఖర్జియా స్టేట్ మెంటును పురస్కరించుకుని కార్తీ చిదంబరం కూడా ముడుపులు తీసుకున్నట్టు లోగడే వార్తలు వచ్చాయి. ఇండియాతో బాటు బ్రిటన్, స్పెయిన్ దేశాల్లో ఆస్తులను కొనుగోలు చేసేందుకు తండ్రీ కొడుకులిద్దరూ ఈ తాయిలాలను వినియోగించుకున్నారని ఈడీ పేర్కొంది. గత ఏడాది ఆగస్టులో చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేయగా… ఆయన మూడు నెలల పాటు తీహార్ జైల్లో గడిపి.. డిసెంబరులో బెయిలుపై విడుదలయ్యారు.