కోవిడ్-19 వ్యాక్సీన్ పాలసీ అంటూ లేదా? కేంద్రంపై రాహుల్ మండిపాటు

| Edited By: Pardhasaradhi Peri

Aug 27, 2020 | 4:46 PM

దేశంలో కరోనా వైరస్ ప్రబలంగా ఉన్నప్పటికీ  ఖఛ్చితమైన కోవిడ్-19 వ్యాక్సీన్ పాలసీ అంటూ ప్రభుత్వం వద్ద లేకపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. అసలు ఈ పాటికే  విధానం అంటూ..

కోవిడ్-19 వ్యాక్సీన్ పాలసీ అంటూ లేదా? కేంద్రంపై రాహుల్ మండిపాటు
Follow us on

దేశంలో కరోనా వైరస్ ప్రబలంగా ఉన్నప్పటికీ  ఖఛ్చితమైన కోవిడ్-19 వ్యాక్సీన్ పాలసీ అంటూ ప్రభుత్వం వద్ద లేకపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. అసలు ఈ పాటికే  విధానం అంటూ ఒకటి ఉండాల్సిందని, ఈ ప్రభుత్వం ఇంకా సంసిధ్దంగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఆయన ట్వీట్ చేశారు. దేశంలో వ్యాక్సీన్ కి సంబంధించి హ్యూమన్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు గానీ వాటికి సంబంధించి ఏయే రాష్ట్రాలు ఇంతవరకు ఏమైనా పురోగతి సాధించాయా, వ్యాక్సీన్ ఉత్పత్తిలో ఏయే కంపెనీలు ఎంతవరకు ముందడుగు వేశాయన్న విషయమై కేంద్రం నుంచి  గానీ ఇండియన్  కౌన్సిల్ ఆఫ్ మెడికల్  రీసెర్చ్ నుంచి గానీ తాజా సమాచారమేదీ లేదు.

ఇక ఇండియాలో గత 24 గంటల్లో 75, 760 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా- ఇప్పటివరకు  వీటి సంఖ్య మొత్తం 33 లక్షలకు పైగా పెరిగింది. ఒక్కరోజులో వెయ్యి మందికి పైగా కరోనా రోగులు మృతి చెందారు.