Shooter Manu Bhakar: ఆ షూటర్ చేసిన ఆరోపణలను ఖండించిన ఎయిరిండియా, సీసీటీవీ ఫుటేజీ రిలీజ్

| Edited By: Pardhasaradhi Peri

Feb 21, 2021 | 7:01 PM

ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్లేందుకు విమానం ఎక్కేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన షూటర్, ఇండియన్ ఒలింపియన్ మను భాకర్ చేసిన ఆరోపణలను ఎయిరిండియా..

Shooter Manu Bhakar: ఆ షూటర్ చేసిన ఆరోపణలను ఖండించిన ఎయిరిండియా, సీసీటీవీ ఫుటేజీ రిలీజ్
Follow us on

ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్లేందుకు విమానం ఎక్కేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన షూటర్, ఇండియన్ ఒలింపియన్ మను భాకర్ చేసిన ఆరోపణలను ఎయిరిండియా తోసిపుచ్చింది. శిక్షణ కోసం తాను వెపన్స్ తీసుకురాగా అందుకు 10 వేల రూపాయలు చెల్లించాలని ఎయిరిండియా అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని, పైగా ఎయిరిండియా అధికారి మనోజ్ గుప్తా, ఇతర సిబ్బంది తనను వేధించారని మను భాకర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే దీన్ని ఖండిస్తూ ఆదివారం ఓ సీసీటీవీ ఫుటేజీని ఈ సంస్థ రిలీజ్ చేసింది. కేవలం చట్టపరంగా ఉన్న డాక్యుమెంట్లనే చూపాలని సెక్యూరిటీ అధికారులు కోరారని తెలిపింది. ఆమె చూపిన పత్రాలను వెరిఫై చేసిన వారు.. ఆయుధాలు తీసుకువెళ్లేందుకు అవసరమైన మినహాయింపు చార్జీల ప్రస్తావన ఈ డాక్యుమెంట్లలో లేని విషయాన్ని వారు గుర్తించారని, పైగా మీరు చూపిన డాక్యుమెంట్లు ఎందుకు చెల్లుబాటు కావడంలేదని ప్రశ్నించారని వివరించింది. 10 వేల రూపాయలు కోరారన్న ఆరోపణ అర్థం లేనిదని పేర్కొంది. ఇక మనోజ్ గుప్తా అనే అధికారి ఆమెను  వేధించలేదని, కావాలంటే ఈ సీసీటీవీ ఫుటేజీ చూడాలని ఎయిరిండియా కోరింది.

తనను ఈ అధికారులు విమానం ఎక్కనివ్వడంలేదని, వేధించారంటూ మను భాకర్ కేంద్ర మంత్రి కిరణ్ రిజ్జును ఉద్దేశించి ట్వీట్ చేయగా ఆయన జోక్యం చేసుకుని ఈమెకు సాయపడ్డారు. చివరకు ఈ షూటర్ ఎయిరిండియా విమానం ఎక్కింది.

Read More:

Covid Second Wave: దేశవ్యాప్తంగా కరోనా వేవ్ మళ్లీ మొదలైందా…! ఇది సంధికాలమా..! పెరుగుతున్న గణాంకాలు దేనికి సంకేతం..

సమన్లు జారీ చేస్తారా ? భయపడబోం, ఎవరికీ తలవంచం, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ