సీఏఏతో ముస్లిములకు ముప్పేమీ లేదు.. తలైవా

| Edited By: Srinu

Feb 05, 2020 | 3:51 PM

సీఏఏతో ముస్లిములకు ఎలాంటి ముప్పు లేదని ప్రకటించారు సూపర్ స్టార్ రజినీకాంత్.. వారికి ఏదైనా సమస్య తలెత్తితే వారి తరఫున గళమెత్తేవారిలో  తాను మొట్టమొదటివాడినవుతానని అన్నారు. అలాగే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (పౌర జనాభా గణన) దేశానికి అవసరమని ఆయన చెప్పారు. సవరించిన పౌరసత్వ చట్టంపై మొదటిసారిగా తన వైఖరిని స్పష్టం చేసిన తలైవా.. దేశ విభజన సమయంలో ఇండియాలోనే ఉండాలని ఈ దేశాన్ని ఎంపిక చేసుకున్న ముస్లిములను దేశం నుంచి ఎలా పంపివేస్తారని ప్రశ్నించారు. సీఏఏపై […]

సీఏఏతో ముస్లిములకు ముప్పేమీ లేదు.. తలైవా
Follow us on

సీఏఏతో ముస్లిములకు ఎలాంటి ముప్పు లేదని ప్రకటించారు సూపర్ స్టార్ రజినీకాంత్.. వారికి ఏదైనా సమస్య తలెత్తితే వారి తరఫున గళమెత్తేవారిలో  తాను మొట్టమొదటివాడినవుతానని అన్నారు. అలాగే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (పౌర జనాభా గణన) దేశానికి అవసరమని ఆయన చెప్పారు. సవరించిన పౌరసత్వ చట్టంపై మొదటిసారిగా తన వైఖరిని స్పష్టం చేసిన తలైవా.. దేశ విభజన సమయంలో ఇండియాలోనే ఉండాలని ఈ దేశాన్ని ఎంపిక చేసుకున్న ముస్లిములను దేశం నుంచి ఎలా పంపివేస్తారని ప్రశ్నించారు. సీఏఏపై విద్యార్థులు ఆందోళనలు చేసే బదులు.. తమ చదువుల గురించి అధ్యాపకులతో చర్చించాలని, ఆయా సబ్జెక్టులను ఎనలైజ్ చేయాలని రజినీకాంత్ సూచించారు. కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాలకోసం సీఏఏని అడ్డు పెట్టుకుని ప్రజలను రెచ్చగొడుతున్నాయని ఆయన ఆరోపించారు. తమిళనాడులో వచ్ఛే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటివరకు తన రాజకీయ పార్టీ గురించి బాహాటంగా ప్రస్తావించని సూపర్ స్టార్.. తొలిసారిగా  ఓ వివాదాస్పద చట్టం మీద మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడడం గమనార్హం.. రాబోయే కాలంలో ఆయన బీజేపీకి మద్దతుగా తన పొలిటికల్ కెరీర్ ని మలచుకున్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు.