విభేదాలు మరచి కలిసికట్టుగా కరోనాను ఎదుర్కొందాం.. అమిత్ షా

| Edited By: Anil kumar poka

Jun 15, 2020 | 5:56 PM

అన్ని రాజకీయ పార్టీలు తమ విభేదాలను పక్కనబెట్టి కలిసికట్టుగా కరోనా వైరస్ ని ఎదుర్కొనేందుకు కృషి చేయాలని  హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీలో ప్రతివారికీ కరోనా టెస్టులు జరుగుతాయని...

విభేదాలు మరచి కలిసికట్టుగా కరోనాను ఎదుర్కొందాం.. అమిత్ షా
Follow us on

అన్ని రాజకీయ పార్టీలు తమ విభేదాలను పక్కనబెట్టి కలిసికట్టుగా కరోనా వైరస్ ని ఎదుర్కొనేందుకు కృషి చేయాలని  హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీలో ప్రతివారికీ కరోనా టెస్టులు జరుగుతాయని, రానున్న రోజుల్లో రోజుకు పద్దెనిమిది వేల పరీక్షలు నిర్వహించేలా చూస్తామని ఆయన చెప్పారు. సోమవారం ఢిల్లీలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన .. ఈ ప్రభుత్వం ప్రకటించిన గైడ్ లైన్స్ ని అని పార్టీలూ అమలు చేయాలని  కోరారు. ఈ మీటింగ్ లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గానీ, డిప్యూటీ సీఎం మనీష్ శిశోడియా గానీ, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ గానీ పాల్గొనలేదు.

ఈ సమావేశానంతరం అమిత్ షా లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి.. కరోనా పరిస్థితిని సమీక్షించారు. ఇదిలా ఉండగా… ఢిల్లీలో మళ్ళీ లాక్ డౌన్ విధించే ప్రసక్తి లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.