‘ నా దిష్టిబొమ్మలను తగులబెట్టండి .. ప్రభుత్వ ఆస్తులను కాదు ‘ ..మోదీ ధ్వజం

|

Dec 22, 2019 | 3:28 PM

సవరించిన పౌరసత్వ చట్ట చట్టంపై దేశంలో అల్లర్లు, నిరసనలు పెల్లుబికిన నేపథ్యంలో.. ప్రధాని మోదీ మొట్టమొదటిసారిగా వీటిపై తీవ్రంగా స్పందించారు. ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన..ఆందోళనకారులు మొదట తన దిష్టిబొమ్మలను తగులబెట్టాలని, పబ్లిక్ ప్రాపర్టీ (ప్రభుత్వ ఆస్తులను) ని కాదని.. అన్నారు. ‘ నన్ను టార్గెట్ చేయండి.. వాటిని కాదు ‘ అని వ్యాఖ్యానించారు. ఈ చట్టాన్ని పూర్తిగా సమర్థించిన మోదీ.. దీనిపై ప్రతిపక్షాలు అబధ్ధాలు ప్రచారం […]

 నా దిష్టిబొమ్మలను తగులబెట్టండి .. ప్రభుత్వ ఆస్తులను కాదు  ..మోదీ ధ్వజం
Follow us on

సవరించిన పౌరసత్వ చట్ట చట్టంపై దేశంలో అల్లర్లు, నిరసనలు పెల్లుబికిన నేపథ్యంలో.. ప్రధాని మోదీ మొట్టమొదటిసారిగా వీటిపై తీవ్రంగా స్పందించారు. ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన..ఆందోళనకారులు మొదట తన దిష్టిబొమ్మలను తగులబెట్టాలని, పబ్లిక్ ప్రాపర్టీ (ప్రభుత్వ ఆస్తులను) ని కాదని.. అన్నారు. ‘ నన్ను టార్గెట్ చేయండి.. వాటిని కాదు ‘ అని వ్యాఖ్యానించారు. ఈ చట్టాన్ని పూర్తిగా సమర్థించిన మోదీ.. దీనిపై ప్రతిపక్షాలు అబధ్ధాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. నిజానికి ఈ చట్టంగానీ, ఎన్నార్సీ గానీ దేశ ప్రయోజనకరమైనవేనని పేర్కొన్నారు.

భారతీయ ముస్లిములకు ఇవి మేలు చేసేవేనని, అసలు ఈ చట్టాలతో వారికి సంబంధమే లేదని చెప్పారు. దేశంలో ఎన్నార్సీ నిర్బంధ శిబిరాలు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నార్సీ, పౌరసత్వ చట్టాలపై ఇక్కడి ముస్లిములు ఆందోళన చెందాల్సిన పనే లేదని మోదీ అన్నారు.’ ఎన్నార్సీ నిబంధనలను మేము తేలేదు. ఇవి ఎంతోకాలం నుంచి ఉన్నవే.. ఇక సీఏఏ.. మహాత్మా గాంధీ విజన్ ‘ అని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలోని హిందువులను భారత దేశంలోకి ఆహ్వానిస్తామని మహాత్ముడు ఏనాడో చెప్పాడని ఆయన గుర్తు చేశారు. ‘ సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ ‘ పట్ల బీజేపీకి నమ్మకం ఉందని, పౌరసత్వ చట్టంపై ఎందుకింతగా భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. మహాత్ముని ఆశయాలను తాము పాటిస్తున్నామని ఆయన చెప్పారు. పాక్ లో వేధింపులను ఎదుర్కొంటున్న మైనారిటీలు ఎస్సీ, ఎస్టీలకు చెందినవారే.. ఈ కొత్త చట్టం ప్రజల సంక్షేమం కోసమే అని మోదీ అన్నారు. ఈ చట్టాన్ని నిరసించడం ద్వారా పార్లమెంటును అగౌరవపరుస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. పోలీసులు మీ రక్షణ కోసమే ఉన్నారని, అలాంటివారిపై దాడులు చేయడం సరికాదని పేర్కొన్నారు.
మైనారిటీ శరణార్థులకు మద్దతుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడలేదా ? ఆయన చెప్పిన దాన్ని నేను పాటిస్తే దోషినెలా అవుతాను అని కూడా మోదీ అన్నారు.
. ..