‘రోటీ-బేటీ’.. ఇండో-నేపాల్ బంధంపై రాజ్ నాథ్ సింగ్

| Edited By: Anil kumar poka

Jun 15, 2020 | 3:33 PM

భారత్-నేపాల్ మధ్య సంబంధాలు అసాధారణమైనవని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఈ రెండు దేశాలు 'రోటీ-బేటీ' లా కలిసికట్టుగా ఉన్నాయని, ప్రపంచంలో ఏ శక్తీ ఈ బంధాన్ని విడదీయజాలదని ఆయన పేర్కొన్నారు..

రోటీ-బేటీ.. ఇండో-నేపాల్ బంధంపై రాజ్ నాథ్ సింగ్
Follow us on

భారత్-నేపాల్ మధ్య సంబంధాలు అసాధారణమైనవని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఈ రెండు దేశాలు ‘రోటీ-బేటీ’ లా కలిసికట్టుగా ఉన్నాయని, ప్రపంచంలో ఏ శక్తీ ఈ బంధాన్ని విడదీయజాలదని ఆయన పేర్కొన్నారు. బీజేపీ జన సంవాద్ వర్చ్యువల్ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. ఇండో-నేపాల్ మధ్య ఇటీవల తలెత్తిన ఉద్రిక్తతలను తేలిగ్గా తీసుకున్నారు. ఇవి త్వరలోనే సమసిపోతాయన్నారు. అలాగే భారత్ కు చెందిన మూడు భూభాగాలను నేపాల్ తమవిగా చెప్పుకుంటూ కొత్త మ్యాప్ రూపొందించి ఇందుకు సంబంధించిన సవరణ బిల్లును తమ పార్లమెంట్ చేత ఆమోదింప జేసిన విషయాన్ని కూడా రాజ్ నాథ్ సింగ్ దాటవేశారు.   అయితే లిపులేఖ్ ప్రాంతంలో మన దేశం నిర్మిస్తున్న రోడ్డు పూర్తిగా భారత భూభాగంలోనే ఉందని, అంటే ఆ ప్రాంతం మన దేశ పరిధిలోకే వస్తుందని ఆయన పేర్కొన్నారు.

అటు-ఈ నెల 14 న బీహార్ లోని సీతామర్హి జిల్లా సమీపాన.. బోర్డర్ ఏరియా వద్ద నేపాలీ బోర్డర్ గార్డులు ఓ రైతును కాల్చి చంపారు. దీనిపై ఇండియా నేపాల్ కు తీవ్ర నిరసన తెలిపింది. ఈ అంశాన్ని కూడా రాజ్ నాథ్ ప్రస్తావించక పోవడం విశేషం. కాగా-నేపాల్ పార్లమెంట్ చర్యను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించిన సంగతి విదితమే.