మేము సైతం,వ్యాక్సిన్ తీసుకున్న రాజకీయ నేతలు, తొలి రోజున బీజేపీ ఎంపీ, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే,వ్యాక్సినేషన్

| Edited By: Pardhasaradhi Peri

Jan 16, 2021 | 5:54 PM

ఇండియాలో భారీ ఎత్తున చేబట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో మొదటిసారి రాజకీయ నేతలు తాము కూడా ఈ టీకామందు తీసుకుంటామంటూ..

మేము సైతం,వ్యాక్సిన్ తీసుకున్న రాజకీయ నేతలు, తొలి రోజున బీజేపీ ఎంపీ, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే,వ్యాక్సినేషన్
Follow us on

ఇండియాలో భారీ ఎత్తున చేబట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో మొదటిసారి రాజకీయ నేతలు తాము కూడా ఈ టీకామందు తీసుకుంటామంటూ ముందుకు వచ్చారు. ఇప్పటివరకు ఇందుకు ఎవరూ ఆసక్తి చూపకపోయినా బీజేపీ ఎంపీ ఒకరు, తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన ఓ ఎమ్మెల్యే శనివారం వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఉత్తరప్రదేశ్ కి చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ మహేష్ శర్మ, బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ ఛటర్జీ టీకామందు తీసుకున్నారు. బెంగాల్ లో పూర్బా బర్ధమాన్ జిల్లాకు చెందిన ఛటర్జీ ..తాను ఈ బృహత్తర కార్యక్రమంలో పరోక్ష పాత్ర వహించానని చెప్పుకున్నారు. అటు ఎంపీ మహేష్ శర్మ హాస్పటల్ లో అరగంట సేపు ఉన్నారు. డాక్టర్ల అబ్జర్వేషన్ అనంతరం ఆయన బయటకు నిష్క్రమించారు. వ్యాక్సిన్ తీసుకున్న ప్రతివారూ ఆయా కేంద్రాల్లో లేదా ఆస్పత్రుల్లో సుమారు అరగంట లేదా గంట సేపు ఉండాల్సి వస్తుంది. టీకామందు తీసుకున్నవారిలో ఏ సైడ్ ఎఫక్ట్స్ లేవని వైద్య సిబ్బంది నిర్ధారించుకున్న తరువాతే వారిని పంపివేస్తారు. కాగా తొలిరోజున  దేశ వ్యాప్తంగా సుమారు మూడు లక్షలమందికి వ్యాక్సిన్ వేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు సంబంధించి కేంద్రం ఓ ప్రకటన జారీ చేయనుంది.