కర్నాటకలో కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానంపై గట్టెక్కిన ఎడ్యూరప్ప ప్రభుత్వం

| Edited By: Pardhasaradhi Peri

Sep 27, 2020 | 11:25 AM

కర్నాటక అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సీఎం ఎడ్యూరప్ప ప్రభుత్వం పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. శనివారం రాత్రి ఈ తీర్మానంపై మూజువాణీ ఓటింగ్ నిర్వహించగా ఎడ్యూరప్ప సర్కార్ నెగ్గింది. మొదట చర్చను ప్రారంభించిన..

కర్నాటకలో కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానంపై గట్టెక్కిన ఎడ్యూరప్ప ప్రభుత్వం
Follow us on

కర్నాటక అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సీఎం ఎడ్యూరప్ప ప్రభుత్వం పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. శనివారం రాత్రి ఈ తీర్మానంపై మూజువాణీ ఓటింగ్ నిర్వహించగా ఎడ్యూరప్ప సర్కార్ నెగ్గింది. మొదట చర్చను ప్రారంభించిన విపక్ష నేత, మాజీ సీఎం సిద్దరామయ్య..ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, ముఖ్యమంత్రి కుటుంబమే అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. మీ కుమారుడు విజయేంద్ర అవినీతికి పాల్పడలేదా.. ఇది బహిరంగ రహస్యమే అన్నారు. అయితే ఈ ఆరోపణను నిరూపించాలని, నిరాధారమైన నిందలు సరికాదని ఎడ్యూరప్ప అన్నారు. దీన్ని నిరూపిస్తే తాను రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటాన్నారు. చివరకు అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్టు స్పీకర్ ఖగేరి ప్రకటించి అసెంబ్లీ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు.