రేప్ కేసు..సుప్రీంకోర్టుకెక్కిన నిందితుడు బిషప్…

| Edited By: Pardhasaradhi Peri

Jul 25, 2020 | 7:05 PM

పంజాబ్ లోని జలంధర్ కు చెందిన బిషప్ ఒకరు రేప్ కేసులో తనను ఇరికించారని, ఈ అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకెక్కాడు. ఫ్రాంకో ములక్కల్ అనే ఈ బిషప్ 2014-16 మధ్యకాలంలో కేరళకు చెందిన ఓ నన్ పై పలు మార్లు..

రేప్ కేసు..సుప్రీంకోర్టుకెక్కిన నిందితుడు బిషప్...
Follow us on

పంజాబ్ లోని జలంధర్ కు చెందిన బిషప్ ఒకరు రేప్ కేసులో తనను ఇరికించారని, ఈ అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకెక్కాడు. ఫ్రాంకో ములక్కల్ అనే ఈ బిషప్ 2014-16 మధ్యకాలంలో కేరళకు చెందిన ఓ నన్ పై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడట. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై 2018 జూన్ లో కొట్టాయం పోలీసులు ఇతనిపై కేసు నమోదు చేశారు. అయితే తనపై కేసును కొట్టివేయాలని కోరుతూ ములక్కల్…ట్రయల్ కోర్టుతో బాటు … కేరళ హైకోర్టులోకూడా   పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఆ కోర్టులు కొట్టివేశాయి. కేరళ పోలీసు శాఖకు చెందిన ‘సిట్’ ఇతడిని  2018 సెప్టెంబరులో అరెస్టు చేసింది. ఎన్నోసార్లు ఇంటరాగేషన్ అనంతరం 40 రోజుల తరువాత బెయిలుపై విడుదల చేసింది. అయితే ఇప్పటికీ తనను పోలీసులు వేధిస్తున్నారని, తనపై రేప్ అభియోగాలను కొట్టివేయాలని ములక్కల్ సుప్రీంకోర్టుకెక్కాడు.