కోవిడ్ వ్యాక్సీన్ ఉత్పత్తిలో ఇండియా గ్రేట్ , బిల్ గేట్స్ ప్రశంస

| Edited By: Pardhasaradhi Peri

Oct 20, 2020 | 2:54 PM

కోవిడ్ పై జరుగుతున్న పోరులో ఇండియా పాత్ర చాలా కీలకమని బిలియనీర్, ఫిలాంత్రొపిస్ట్ కూడా అయిన బిల్ గేట్స్ ప్రశంసించారు. గత రెండు దశాబ్దాల్లో తమ దేశ ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు ఇండియా పలు చర్యలు తీసుకుందని ఆయన చెప్పారు. కోవిడ్ టీకామందు తయారీలో భారతదేశ కృషి పలు దేశాలకు స్ఫూర్తినిస్తుందన్నారు. ఢిల్లీలో గ్రాండ్ ఛాలెంజెస్ వార్షిక సమావేశం-2020 లో వర్చ్యువల్ గా ఆయన పాల్గొన్నారు. 2021 సమ్మర్ నాటికి కోవిడ్ వ్యాక్సీన్లు అందుబాటులోకి రావడం తథ్యమన్న […]

కోవిడ్ వ్యాక్సీన్ ఉత్పత్తిలో ఇండియా గ్రేట్ , బిల్ గేట్స్ ప్రశంస
Follow us on

కోవిడ్ పై జరుగుతున్న పోరులో ఇండియా పాత్ర చాలా కీలకమని బిలియనీర్, ఫిలాంత్రొపిస్ట్ కూడా అయిన బిల్ గేట్స్ ప్రశంసించారు. గత రెండు దశాబ్దాల్లో తమ దేశ ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు ఇండియా పలు చర్యలు తీసుకుందని ఆయన చెప్పారు. కోవిడ్ టీకామందు తయారీలో భారతదేశ కృషి పలు దేశాలకు స్ఫూర్తినిస్తుందన్నారు. ఢిల్లీలో గ్రాండ్ ఛాలెంజెస్ వార్షిక సమావేశం-2020 లో వర్చ్యువల్ గా ఆయన పాల్గొన్నారు. 2021 సమ్మర్ నాటికి కోవిడ్ వ్యాక్సీన్లు అందుబాటులోకి రావడం తథ్యమన్న విశ్వాసాన్ని  బిల్ గేట్స్ వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఎలాంటి పాండమిక్ నైనా ఎదుర్కొనేందుకు వ్యాక్సీన్ ‘సముదాయాలను’ ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరమని  గేట్స్ పేర్కొన్నారు. రోటా వైరస్ ప్రోగ్రాం లో ఇండియాతో తమ గేట్స్ ఫౌండేషన్ భాగస్వామి కావడం సంతోషకరమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా-ప్రధాని మోదీ తన ప్రసంగంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం.