జై శ్రీరామ్, రిపబ్లిక్ డే నాడు శకటాల ప్రదర్శనలో ఫస్ట్ ప్రైజ్ సాధించిన ‘రామ మందిర’ నమూనా

| Edited By: Pardhasaradhi Peri

Jan 28, 2021 | 12:14 PM

ఈ ఏడాది గణ తంత్ర దినోత్సవం రోజున రాజ్ పథ్ వద్ద వివిధ రాష్ట్రాలనుంచి పలు శకటాలను ప్రదర్శించారు. భారతీయ సంస్కృతి..

జై శ్రీరామ్, రిపబ్లిక్ డే నాడు శకటాల ప్రదర్శనలో ఫస్ట్ ప్రైజ్ సాధించిన రామ మందిర నమూనా
Follow us on

ఈ ఏడాది గణ తంత్ర దినోత్సవం రోజున రాజ్ పథ్ వద్ద వివిధ రాష్ట్రాలనుంచి పలు శకటాలను ప్రదర్శించారు. భారతీయ సంస్కృతి, కళలు, సాహిత్యాన్ని, దేశ ఆయుధ సంపత్తిని చాటే అనేక శకటాలు కనువిందు చేశాయి. వేటికవే సృజనాత్మకతను చాటాయి. అయితే అన్ని శకటాల్లో కెల్లా యూపీ అయోధ్యలో నిర్మితం కానున్న రామ మందిర నమూనా శకటమే అత్యంత ఆకర్షణగా నిలిచింది. ఇది సాగుతుండగా అనేకమంది గౌరవపురస్కరంగా తమ సీట్ల నుంచి లేచి నిలబడి చేతులు జోడించారు. కొందరు చప్పట్లు కొడితే మరికొందరు జైశ్రీరాం అంటూ నినాదాలు చేశారు.  వాల్మీకి మహర్షి రామాయణగాథను రచిస్తున్నట్టుగా ముందు వైపు, రామాలయ నిర్మాణం తాలూకు నమూనా వెనుకవైపు ఉన్న  ఈ శకటానికి మొదటి బహుమతిని ప్రకటించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ ప్రైజ్ ని యూపీ ప్రభుత్వానికి అందజేయనున్నారు. దీన్నిరూపొందించిన కళాకారులను, శకట తయారీదారులను ఆయన అభినందించారు.