Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కీలక పరిణామం.. కీలక నేతకు సుప్రీంకోర్టు బెయిల్

|

Apr 02, 2024 | 3:26 PM

పార్లమెంట్ ఎన్నికల ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్టు కావడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులో అధికారులు ఎలా వ్యవహరిస్తున్నారు? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అనేది చర్చనీయాంశమవుతోంది. అయితే తాజాగా ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జైల్లో ఉన్న ఆప్‌ ఎంపీ, కీలక నేత సంజయ్‌సింగ్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కీలక పరిణామం.. కీలక నేతకు సుప్రీంకోర్టు బెయిల్
Supreme Court
Follow us on

పార్లమెంట్ ఎన్నికల ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్టు కావడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులో అధికారులు ఎలా వ్యవహరిస్తున్నారు? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అనేది చర్చనీయాంశమవుతోంది. అయితే తాజాగా ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జైల్లో ఉన్న ఆప్‌ ఎంపీ, కీలక నేత సంజయ్‌సింగ్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. లిక్కర్‌ స్కాం విచారణ ముగిసే వరకు ఆయనకు బెయిల్‌ ఇస్తునట్టు సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. మనీలాండరింగ్‌ కేసులో సంజయ్‌సింగ్‌ను ఆరునెలల క్రితం ఈడీ అరెస్ట్‌ చేసింది.

కేజ్రీవాల్‌ అరెస్ట్‌తో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆప్‌కు ఇది పెద్ద ఊరటగా చెప్పుకోవచ్చు. సంజయ్‌సింగ్‌ బెయిల్‌ పిటిషన్‌ను ఈడీ తరపు న్యాయవాది కూడా వ్యతిరేకించలేదు.. సంజయ్‌సింగ్‌కు బెయిల్‌ ఇవ్వడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈడీ న్యాయస్థానం ముందు వెల్లడించింది. తొలుత ఛార్ఝ్‌షీట్‌లో సంజయ్‌సింగ్‌ పేరు లేదని , తరువాత ఎందుకు

చేర్చారని ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆరు నెలలులగా సంజయ్‌సింగ్‌కు బెయిల్‌ను ఎందుకు అడ్డుకున్నారని ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సంజయ్‌సింగ్‌ 2 కోట్ల రూపాయల లంచం తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే ఆయన దగ్గర ఒక్క పైసాను కూడా ఈడీ స్వాధీనం చేసుకోలేదని కోర్టుకు సంజయ్‌సింగ్‌ తరపు న్యాయవాది వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీఎం కేజ్రీవాల్‌తో పాటు మరో ఆప్‌ నేత మనీష్‌ సిసోడియా తిహార్‌ జైల్లో ఉన్నారు.