యూపీలో ‘కొవాగ్జిన్’ మూడో దశ ట్రయల్స్ కి శ్రీకారం ?

| Edited By: Anil kumar poka

Sep 24, 2020 | 1:03 PM

ఐసీఎంఆర్ తోడ్పాటుతో భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న 'కొవాగ్జిన్' మూడో దశ ట్రయల్స్ ని యూపీ రాజధాని లక్నోలోను, గోరఖ్ పూర్ లోను ప్రారంభించనున్నారు. ఇందుకు తమ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని పేర్కొంటూ యూపీ అదనపు చీఫ్ సెక్రటరీ అమిత్ మోహన్ ప్రసాద్.

యూపీలో కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ కి శ్రీకారం ?
Follow us on

ఐసీఎంఆర్ తోడ్పాటుతో భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న ‘కొవాగ్జిన్’ మూడో దశ ట్రయల్స్ ని యూపీ రాజధాని లక్నోలోను, గోరఖ్ పూర్ లోను ప్రారంభించనున్నారు. ఇందుకు తమ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని పేర్కొంటూ యూపీ అదనపు చీఫ్ సెక్రటరీ అమిత్ మోహన్ ప్రసాద్..భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ డైరెక్టర్ వి.కృష్ణమోహన్ కు లేఖ రాశారు. అంతకుముందే కృష్ణమోహన్ తమ ప్రతిపాదనను ఆమోదించవలసిందిగా యూపీ సర్కార్ కి లేఖ రాశారు. యూపీలో లక్నో, గోరఖ్ పూర్ జిల్లాలను తమ మూడో దశ ట్రయల్స్ కోసం ఎంచుకున్నామని ఆయన పేర్కొన్నారు.

కొవాగ్జిన్  వ్యాక్సీన్ కోసం లక్షలాది రోగులు ఎదురు చూస్తున్నారని, తొలిదశలో ఈ రెండు జిల్లాలను తాము సెలెక్ట్ చేశామని ఈ కంపెనీ వెల్లడించింది. కాగా ఇండియాలో కరోనా వైరస్ కేసులు 57 లక్షలకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో వెయ్యిమందికి పైగా కరోనా రోగులు మృతి చెందారు. ఇదే సమయంలో 40 లక్షలమందికి పైగా రోగులు కోలుకున్నారు.