థియేటర్లో జాతీయగీతం.. సీట్ల నుంచి లేవని కుటుంబం.. చివరకు …..

|

Oct 30, 2019 | 11:38 AM

బెంగుళూరులోని ఓ థియేటర్లో మూవీ ప్రారంభానికి ముందు జాతీయ గీతాలాపన ప్లే కావడం ప్రారంభమైంది. ప్రేక్షకులంతా గౌరవసూచకంగా లేచి నిలబడ్డారు. అయితే నలుగురు సభ్యుల కుటుంబం మాత్రం లేచి నిలబడకుండా అలాగే కూర్చుండిపోయారు. అంతే ! ఇది చూసిన హాల్లోని ఇతరులంతా ఆ ఫ్యామిలీ వద్ద గుమికూడారు. మీకు దేశభక్తి లేదంటూ దుమ్మెత్తి పోశారు. వారిలో ఇద్దరు కన్నడ యాక్టర్లు.. బీవీ ఐశ్వర్య, అరుణ్ గౌడ కూడా ఉన్నారు. మీరు ‘ పాకిస్థానీ టెర్రరిస్టులంటూ ‘ ఈ […]

థియేటర్లో జాతీయగీతం.. సీట్ల నుంచి లేవని కుటుంబం.. చివరకు .....
Follow us on

బెంగుళూరులోని ఓ థియేటర్లో మూవీ ప్రారంభానికి ముందు జాతీయ గీతాలాపన ప్లే కావడం ప్రారంభమైంది. ప్రేక్షకులంతా గౌరవసూచకంగా లేచి నిలబడ్డారు. అయితే నలుగురు సభ్యుల కుటుంబం మాత్రం లేచి నిలబడకుండా అలాగే కూర్చుండిపోయారు. అంతే ! ఇది చూసిన హాల్లోని ఇతరులంతా ఆ ఫ్యామిలీ వద్ద గుమికూడారు. మీకు దేశభక్తి లేదంటూ దుమ్మెత్తి పోశారు. వారిలో ఇద్దరు కన్నడ యాక్టర్లు.. బీవీ ఐశ్వర్య, అరుణ్ గౌడ కూడా ఉన్నారు. మీరు ‘ పాకిస్థానీ టెర్రరిస్టులంటూ ‘ ఈ ఇద్దరితో బాటు అంతా గళమెత్తారు. రభస మెల్లగా మొదలై పీక్ స్టేజికి చేరింది. థియేటర్లో నేషనల్ యాంథమ్ ప్లే అవుతున్నప్పుడు లేచి నిలబడని మీరు భారత వ్యతిరేకులని, వీళ్ళ కెంత ధైర్యమని, ఇలాంటి వారు తమను భారతీయులుగా చెప్పుకుంటారని ఐశ్వర్య.. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ కామెంట్ చేసింది. బెంగుళూరు లోని మల్లేశ్వరంలో గల పీవీఆర్ ఓరియన్ మాల్ లో ఈ మధ్య జరిగిందీ ఘటన. ధనుష్ నటించిన ‘ అసురన్ ‘ చిత్ర ప్రదర్శన సందర్భంగా హాల్లో జరిగిన ఈ ‘ లొల్లి ‘ చాలాసేపు నడిచింది.
జాతీయగీతాలాపన సమయంలో లేచి నిలబడని ఈ కుటుంబం వద్దకు ఆగ్రహంతో వఛ్చిన గుంపు పెద్దఎత్తున వారితో వాగ్యుధ్ధానికి దిగింది.’ అసలు ఇది తమ ఇష్టమని, ఈ యువతి అంటోంది.. ఇదెక్కడి వింత ? వీళ్ళు భారతీయులు కారా ?’ అని గుంపులోని ఓ వ్యక్తి పెద్దగా అరిచాడు. ఇందుకు సదరు యువతి.. ఈ స్వల్ప విషయాన్ని ఇంతటితో వదిలేద్దామని, ఇది కేవలం మూవీ అని, మీరు మా మీద కేసు వేస్తే వేసుకోవాలని వ్యాఖ్యానించింది. ‘ అలాగా ! అయితే మేం తప్పకుండా కేసు వేస్తాం ‘ అని ఆ గుంపులో మరొకరు అన్నారు. ‘ మీరు భారత గడ్డ మీద ఉంటూ ఇలా చేయడానికి సిగ్గుగా లేదా ? మీరు పాకిస్థానీ టెర్రరిస్టులా ‘ ? అని ఒకరు రెట్టించిన స్వరంతో అన్నారు. కెమెరా వంక చూస్తూ మరొకరు.. ‘ వీళ్ళ ముఖాలు చూడండి.. మూడు గంటలు సినిమా చూసే వీరు…. కేవలం ఓ 52 సెకండ్లు లేచి నిలబడలేరా ‘ అన్నాడు.
కాగా-ఈ వీడియో చూసిన నెటిజన్లలో పలువురు పలురకాలుగా స్పందించారు. కొంతమంది ఈ గుంపును సమర్థించారు. ఆ ప్రేక్షకులు ఆ కుటుంబాన్నినిలదీయడం సబబే అని, జాతీయ గీతం ఎప్పుడు ప్లే అయినా గౌరవ సూచకంగా లేచి నిలబడాల్సిందేనని వీరు వెనకేసుకొచ్చారు. కానీ మరికొంతమంది మాత్రం… ఎవరి ఇష్టం వారిది, ఒకరిని బలవంత పెట్టే హక్కు వీళ్లకు ఎవరిచ్చారని ఆ కుటుంబాన్ని సమర్థించారు. ‘ మీరేమైనా ఈ దేశ జాతి పితలా ? దేశభక్తిపై తప్పుడు ప్రాపగాండా ఆపండి ‘ అని మరికొంతమంది ఆ గుంపును నిలదీశారు. మొత్తానికి ఈ తతంగం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.