లైకులు కొట్టేముందు ఆలోచించండి.. విద్యార్థిని కొంపముంచిన లవ్ ఏమోజి.. భారత్ నుంచి బంగ్లాదేశ్ పంపించిన అధికారులు..

|

Aug 29, 2024 | 12:26 PM

సోషల్ మీడియాలో పలు రకాల పోస్టులకు లైక్ థంబ్, లాఫ్, లవ్ ఎమోజి లాంటి సింబల్స్ తో మద్దతు తెలుపుతుంటారు.. అయితే.. ఇదంతా కామానే.. అలా ఓ పోస్ట్ కు లవ్ ఎమోజి ఇచ్చి విద్యార్థిని చిక్కుల్లో పడింది.. చివరకు ఆమెను భారతదేశం నుంచి.. సొంత దేశం బంగ్లాదేశ్ కు పంపించేశారు.. అసలేం జరిగిందంటే..

లైకులు కొట్టేముందు ఆలోచించండి.. విద్యార్థిని కొంపముంచిన లవ్ ఏమోజి.. భారత్ నుంచి బంగ్లాదేశ్ పంపించిన అధికారులు..
Bangladeshi Student Issue
Follow us on

సోషల్ మీడియాలో పలు రకాల పోస్టులకు లైక్ థంబ్, లాఫ్, లవ్ ఎమోజి లాంటి సింబల్స్ తో మద్దతు తెలుపుతుంటారు.. అయితే.. ఇదంతా కామానే.. అలా ఓ పోస్ట్ కు లవ్ ఎమోజి ఇచ్చి విద్యార్థిని చిక్కుల్లో పడింది.. చివరకు ఆమెను భారతదేశం నుంచి.. సొంత దేశం బంగ్లాదేశ్ కు పంపించేశారు.. అసలేం జరిగిందంటే.. అస్సాంలోని సిల్చార్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్న బంగ్లాదేశ్ విద్యార్థిని సోషల్ మీడియాలో భారతదేశానికి వ్యతిరేకంగా చేసిన పోస్ట్‌పై ‘లవ్’ ఎమోజీతో స్పందించినందున ఆమె తన దేశానికి తిరిగి పంపినట్లు అస్సాం పోలీసులు మంగళవారం తెలిపారు. ఇది “బహిష్కరణ కాదు” కానీ బంగ్లాదేశ్ అధికారులతో సంప్రదింపులు జరిపి వెనక్కి పంపినట్లు కాచర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నుమల్ మహట్టా పేర్కొన్నారు. ఎన్‌ఐటీ సిల్చార్‌లోని ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో నాల్గవ సెమిస్టర్ చదువుతున్న మైషా మహాజబిన్ అనే విద్యార్థినిని సోమవారం కరీంగంజ్ జిల్లా సుతార్‌కండి వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు (ఐసీపీ) ద్వారా తిరిగి బంగ్లాదేశ్‌కు పంపించినట్లు ఎస్పీ తెలిపారు.

“ఇది బహిష్కరణ కేసు కాదు… ఆమె ఇటీవల కోర్సు పూర్తి చేసి ఆరు నెలల క్రితం భారతదేశం విడిచిపెట్టిన తన సీనియర్.. NIT సిల్చార్ పూర్వ విద్యార్థి సహదత్ హుస్సేన్ అల్ఫీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన.. ఒక భారతదేశ వ్యతిరేక పోస్ట్‌లో ప్రేమ చిహ్నంతో స్పందించింది.. ఇప్పుడు అతను ఇప్పుడు బంగ్లాదేశ్‌లో నివసిస్తున్నారు” అని మహత్తా పిటిఐకి చెప్పారు.

ఇలాంటి పోస్ట్‌ను చూసి చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారని, అక్కడ ఆమె ‘లవ్’ ఎమోజీతో స్పందించిందని ఎస్పీ పేర్కొన్నారు. అనంతరం మహాజబిన్ తన దేశానికి వెళ్లేందుకు అనుమతించాల్సిందిగా NIT సిల్చార్ అధికారులను అభ్యర్థించినట్లు కూడా మహత్త పేర్కొన్నారు.

ఆమె కోర్సు పూర్తి చేయడానికి తిరిగి వస్తారా అని అడిగిన ప్రశ్నకు.. ఎస్పీ సమాధానమిస్తూ.. ఆమె ఇంకా తన కోర్సు పూర్తి చేయలేదని.. ఆమె తన చదువును పూర్తి చేయడానికి తిరిగి వస్తుందో లేదో, దాని గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేమంటూ పేర్కొన్నారు.

భారత్, బంగ్లాదేశ్ ప్రభుత్వాల అవగాహన ప్రకారం మొత్తం 70 మంది బంగ్లాదేశ్ విద్యార్థులు ప్రస్తుతం NIT సిల్చార్‌లో చదువుతున్నారు. వీరిలో బంగ్లాదేశ్‌కు చెందిన దాదాపు 40 మంది హిందూ విద్యార్థులు ఎన్‌ఐటీ సిల్చార్‌లో ఉన్నారని మహత్త తెలిపారు. ఈ క్రమంలో తాను విద్యార్థులను వ్యక్తిగతంగా కలుసుకున్నానని.. ఎటువంటి తప్పుడు పని చేయవద్దని లేదా భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని వారికి సూచించినట్లు తెలిపారు.

హిందూ రాఖీ దళ్ ప్రతినిధి సువాశిష్ చౌదరి PTI తో మాట్లాడుతూ.. మాజీ విద్యార్థి భారతీయ వ్యతిరేక పోస్ట్‌ను గమనించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..