గున్న ఏనుగు జలకాలాటలు.. చూడాల్సిందే !

| Edited By: Pardhasaradhi Peri

Jun 13, 2020 | 7:30 PM

చిన్న పిల్లల్లా గున్న ఏనుగులు కూడా సరదాగా నీటిని చూస్తే చాలు.. సరదాగా ఆ నీటిలో గడపడానికి ఇష్టపడతాయి. జలకాలాటలను ఎంతో ఎంజాయ్ చేస్తాయి. ఓ గున్న ఏనుగు చేసిన ఇలాంటి జలకాలాట దృశ్యాన్ని...

గున్న ఏనుగు జలకాలాటలు.. చూడాల్సిందే !
Follow us on

చిన్న పిల్లల్లా గున్న ఏనుగులు కూడా సరదాగా నీటిని చూస్తే చాలు.. సరదాగా ఆ నీటిలో గడపడానికి ఇష్టపడతాయి. జలకాలాటలను ఎంతో ఎంజాయ్ చేస్తాయి. ఓ గున్న ఏనుగు చేసిన ఇలాంటి జలకాలాట దృశ్యాన్ని సుశాంత్ నందా అనే అటవీ అధికారి వీడియోగా షేర్ చేశారు. పై నుంచి జలధార జాలువారుతుంటే.. కింద కొలనులో ఈ పిల్ల ఏనుగు ఎలా ‘స్నానమాడిందో’ హృద్యంగా చూపాడాయన. సాధారణంగా తమ తలిదండ్రుల నీడలో గడిపే చిన్న ఏనుగుల్లా కాకుండా  ఇది ఒంటరిగా ఈ కొలనులో దిగి జలకాలాట ఆడడమే విశేషం. ఈ వీడియోకు వఛ్చిన లైకులకు లెక్కలేదు. చాలామంది దీన్ని చూసి రకరకాలుగా సరదా అయిన కామెంట్లు పెట్టారు.